కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం అర్జీదారులు ఇబ్బందులు పడుతున్నారు. ధ్రువీకరణ పత్రాల కోసం అర్జీదారులు తహసీల్దార్, మీసేవ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. వైఎస్ఆర్ చేయూత పథకానికి ఈ నెల 7వ తేదీతో దరఖాస్తు గడువు ముగుస్తుండటంతో అర్జీదారుల్లో ఆందోళన నెలకొంది. తహసీల్దార్ కార్యాలయాల్లో రెవిన్యూ డిపార్ట్మెంట్ సర్వర్లు పని చేయకపోవడంతో సర్టిఫికెట్స్ మంజూరుకు ఆటంకం ఏర్పడుతుందని అధికారులు అంటున్నారు. పత్రాలు మంజూరు చేసేందుకు మూడు షిప్టుల్లో 24 గంటలు పని చేస్తున్నామని అధికారులు చెప్తున్నారు.
పెండింగ్లో ఉన్న కులధ్రువీకరణ పత్రాలు
మండలం | కులధ్రువీకరణ పత్రాలు |
మోపిదేవి | 1800 |
అవనిగడ్డ | 400 |
కోడూరు | 1800 |
చల్లపల్లి | 420 |
ఘంటసాల | 100 |
నాగాయలంక | 5 |
ఇదే స్థాయిలో ఆదాయ ధ్రువీకరణ పత్రాలు కూడా పెండింగ్ ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి : పుట్టుకతోనే కిడ్నీ లేదు.. అయినా పని మానలేదు!