కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు జన్మదినోత్సవ వేడుకలను పలుచోట్ల ఘనంగా నిర్వహించారు. అవనిగడ్డ పార్టీ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే కేక్ కట్ చేసి నాయకులు, అభిమానులకు కేక్ తినిపించి...స్వీట్లు పంపిణీ చేశారు. పేదలకు దుస్తుల పంపిణీ చేశారు. ఏడాది పాలనలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఎమ్మెల్యే రికార్డు స్థాయిలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా చరిత్ర సృష్టించారని... దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కడవకొల్లు నరసింహారావు అన్నారు. అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ...ప్రజా సంక్షేమం కోసమే ఎమ్మెల్యే పని చేస్తున్నారన్నారు. ఈ సందర్భంగా స్థానిక వంతెన సెంటర్ లోని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి ఎమ్మెల్యే, మార్కెట్ కమిటీ చైర్మన్ పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఘనంగా ఎమ్మెల్యే రమేష్‌బాబు పుట్టినరోజు వేడుకలు - MLA Birthday Celebrations news
అవనిగడ్డ నియోజకవర్గ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు జన్మదినోత్సవ వేడుకలను పలుచోట్ల ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కేక్ కట్ చేసి నాయకులు, అభిమానులకు కేక్ తినిపించి...స్వీట్లు పంపిణీ చేశారు.