విజయవాడ అయోధ్యనగర్లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆటో వర్కర్స్ యూనియన్ స్టాండ్ ప్రారంభం.. భాజపా, వైకాపా శ్రేణుల మధ్య ఘర్షణతో ఉద్రిక్తంగా మారింది. వైకాపా శ్రేణులు జెండాలతో స్టాండ్ ప్రారంభాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించారని భాజపా నేతలు ఆరోపించారు. పోలీసులు వైకాపా నేతలను నిలువరించారు.
స్టాండ్ ప్రారంభించేందుకు తమకు అనుమతి ఉన్నా.... వైకాపా అధికారం బలంతో అడ్డుకోవడానికి ప్రయత్నించిందని.. ఇది సిగ్గుమాలిన చర్య అని భాజపా నాయకులు వంగవీటి నరేంద్ర మండిపడ్డారు. అభద్రతా భావంలో ఉండటం వల్లే వైకాపా... కుట్ర రాజకీయాలకు తెరతీస్తోందని ఆరోపించారు. స్టాండ్ ప్రారంభించి తీరతామని స్పష్టం చేశారు.
ఇవీ చూడండి: