కృష్ణా జిల్లా గుడివాడలోని కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ అటెండర్ రెడ్డి రవి... బ్యాంకు రికార్డు రూములో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రవి గుడివాడ అర్బన్ బ్యాంకు బ్రాంచ్‌లో మూడు సంవత్సరాలుగా అటెండర్‌గా విధులు నిర్వర్తించాడు. రోజూలానే విధులకు హాజరయ్యాడు. బ్యాంక్ రికార్డు గదిలోకి వెళ్లి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
గుర్తించిన ఇతర సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. వ్యక్తిగత కారణాలతోనే రవి ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. గుడివాడ వన్‌టౌన్ పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: