కృష్ణా జిల్లా మైలవరంలో తెలంగాణ నుంచి అక్రమంగా మద్యం రావాణా చేస్తూ పట్టుబడిన ఇద్దరు యువకులు.. మఫ్టీలో ఉన్న ఎక్సైజ్ కానిస్టేబుళ్లపై దాడికి దిగారు. అటుగా వెళ్తున్న మెుబైల్ రోడ్ సేఫ్టీ కానిస్టేబుళ్లు వారిని అదుపులోకి తీసుకుని మైలవరం పోలీస్ స్టేషన్‌కి తరలించారు. అసలకే ఇద్దరూ ఫూటుగా మద్యం సేవించి ఉన్నారేమో.. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వైఎస్సార్ జయంతి సందర్భంగా మద్యం తాగామనీ.. హైకోర్టు మద్యం తెచ్చుకునేందుకు అనుమతి ఇచ్చిందంటూ హల్చల్ చేశారు. నిందితులిద్దరూ ఇబ్రహీంపట్నంకి చెందిన వారిగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: కానిస్టేబుల్‌పై రౌడీషీటర్ హత్యాయత్నం