డిసెంబర్ 21న కృష్ణాజిల్లా జగ్గయపేట మండలం తక్కెళ్లపాడులో సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వైఎస్‌ఆర్-జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్షణ పథకం’ పేరుతో చేపట్టిన సమగ్ర సర్వే నూతన పట్టాల పంపిణీకి సీఎం జగన్ తక్కెళ్లపాడులో శ్రీకారం చుట్టనున్నారు. ఎమ్మెల్యే సామినేని ఉదయభాను నేతృత్వంలో కార్యక్రమానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. కార్యక్రమ నిర్వహణపై కలెక్టర్ ఇంతియాజ్, ఎస్పీ రవీంధ్రనాథ్ బాబు , పలు అధికారులు సమావేశమై చర్చలు జరిపారు.
ఇదీ చదవండి: ఏవోబీలో ఎదురుకాల్పులు.. ఇద్దరు మావోయిస్టులు మృతి