ETV Bharat / state

కరోనా వ్యాక్సిన్ డ్రైరన్‌కు ముమ్మర ఏర్పాట్లు

author img

By

Published : Dec 26, 2020, 8:52 PM IST

రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ డ్రై రన్ కోసం కృష్ణా జిల్లాలో ఏర్పాట్లు జోరందుకున్నాయి. జిల్లాలోని ఐదు చోట్ల వ్యాక్సిన్ సన్నాహక మాక్ డ్రిల్ .. ఈనెల 28న నిర్వహిస్తారు. ఆదివారం నుంచే ముందస్తు సన్నాహక ప్రక్రియను చేపట్టాలని నిర్ణయించారు. ఈ ప్రక్రియ అమలుకు పోలింగ్ కేంద్రం తరహాలోనే ఏర్పాట్లు చేస్తున్నారు.

కరోనా వ్యాక్సిన్ డ్రైరన్‌కు ముమ్మర ఏర్పాట్లు
కరోనా వ్యాక్సిన్ డ్రైరన్‌కు ముమ్మర ఏర్పాట్లు
కరోనా వ్యాక్సిన్ డ్రైరన్‌కు ముమ్మర ఏర్పాట్లు

కరోనా వ్యాక్సిన్ డ్రై రన్ కోసం కృష్ణా జిల్లా ఎంపికైనందున..సంబంధిత జిల్లా అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఆదివారం నుంచి 29 వరకు డమ్మీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం సూచించినట్లుగా 28న పూర్తిస్థాయి డ్రైరన్ నిర్వహించనుండగా..ముందస్తుగా మరికొన్ని కార్యక్రమాలను అధికారులు చేపట్టారు. 27వ తేదీ కో-విన్ యాప్, వెబ్ సైట్​కు సంబంధించిన డ్రైరన్, 28న లాజిస్టిక్ సంబంధిత మాక్ డ్రిల్ , అలాగే 29న వ్యాక్సినేషన్ ట్రయల్ రన్ చేయాలని నిర్ణయించారు.

విజయవాడ ప్రభుత్వాసుపత్రితో పాటు... ప్రైవేటు ఆస్పత్రిగా విజయవాడలోని పూర్ణా హార్ట్ సెంటర్, గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంగా కంకిపాడు మండలం ఉప్పులూరు పీహెచ్​సీ, అర్బన్ ప్రాంతంగా విజయవాడ ప్రకాశ్ నగర్​లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్, పెనమలూరులోని తాడిగడప గ్రామ సచివాలయం వద్ద 28 తేదీన కొవిడ్ వ్యాక్సిన్ డ్రైరన్ నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రతి కేంద్రంలోనూ 25 మంది వైద్య సిబ్బందికి వ్యాక్సినేషన్ వేసేలా డ్రైరన్​ను నిర్వహించనున్నారు.

జిల్లా కేంద్రాల్లో నిల్వ ఉంచిన వాక్సిన్​ను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు, లేదా నిర్దేశిత వ్యాక్సినేషన్ కేంద్రాలకు తరలించటం, వాక్సినేషన్ పొందే వ్యక్తి తాలూకు వివరాలను మ్యాపింగ్ చేయటం వంటి అంశాలను డ్రైరన్​లో భాగంగా నిర్దేశించారు. పోలింగ్ కేంద్రం తరహాలోనే వ్యాక్సినేషన్ ప్రక్రియను చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. ప్రతి కేంద్రంలో ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను, వేచి ఉండేందుకు ఓ గది, వ్యాక్సినేషన్ కోసం మరో గది, విశ్రాంతి కోసం మరో గదిని కేటాయిస్తున్నారు. ఐదుగురు సిబ్బందిని నియమిస్తున్నారు. తొలుత పోలీసు సిబ్బంది వాక్సినేషన్ కోసం వచ్చిన వ్యక్తిని గుర్తించి లోనికి పంపగా.. తర్వాత డిజిటల్ అసిస్టెంట్ వివరాలు నమోదు చేస్తారు. మరో వ్యక్తి వ్యాక్సినేషన్ వేసేలా కార్యాచరణను రూపొందించారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో కొత్తగా 282 కరోనా కేసులు, ఒకరు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.