విద్యుత్తు వ్యవస్థపై యాజమాన్యం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల తాము ఇబ్బందులు పడాల్సి వస్తోందని... ఎపీఎస్పీడీసీఎల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రమేష్‌యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఒక్కో సబ్‌స్టేషన్ నిర్వహణకు రూ.4 వేలు ఖర్చు అవుతుండగా... ప్రభుత్వం కేవలం రూ.వెయ్యి నిర్ణయిస్తూ... ఏ విధంగా టెండర్లు పిలిచిందో అర్థం కావటం లేదన్నారు. గతంలో రూ.6,500 ఇచ్చేవారని గుర్తు చేశారు. తమకు న్యాయం చేయకుంటే ప్రత్యామ్నాయ పనులు చూసుకుంటామని రమేష్‌యాదవ్ హెచ్చరించారు.
ఇదీ చదవండీ...