చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని ఐదు పోలింగ్ కేంద్రాల్లో ఉప ఎన్నికలు నిర్వహించే విషయంలో ఎన్నికల సంఘం పక్షపాత వైఖరిని అవలంభిస్తోందని మచిలీపట్నం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఛైర్మన్ బూరగడ్డ వేదవ్యాస్ అన్నారు. వైకాపా దురుద్ధేశంతో ఇచ్చిన ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న ఈసీ, తెదేపా ఇచ్చిన వినతులను మాత్రం పట్టించుకోకపోవడం దారుణమని పేర్కొన్నారు. ఈవీఎంలు, వీవీప్యాట్లు సక్రమంగా పనిచేయకపోవడం, అనంతరం కేంద్ర ప్రభుత్వం ఒత్తిడితో ఈసీ తీసుకున్న నిర్ణయాల వల్ల ఆ సంస్థ విశ్వసనీయత దెబ్బతినే పరిస్థితి నెలకొందన్నారు. ప్రపంచంలోని ప్రజాస్వామ్య దేశాల్లో అత్యధిక మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునే మన దేశంలో ఎన్నికల సంఘంపై ఇతర దేశాలకు ఒక నమ్మకం ఉందని, ఇప్పడు ప్రతిష్ఠ దిగజార్చే విధంగా నడుచుకోవడం సరికాదని వ్యాఖ్యానించారు.
ఇవీ చదవండి