కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని కృష్ణా విశ్వవిద్యాలయంలో స్ట్రాంగ్ రూంలో భద్రపరిచిన ఈవీఎంలు తరలించారంటూ వచ్చిన వార్తలు జిల్లాలో కలకలం సృష్టించాయి. ఈ వార్తలపై జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ స్పందించారు. ఈవీఎంల తరలింపును ఖండించారు. అవి ఎన్నికల్లో వినియోగించకుండా రిజర్వ్ కోసం ఉంచినవని స్పష్టం చేశారు. రిజర్వ్ ఈవీఎంలు స్ట్రాంగ్ రూంలో ఉంచకూడదన్న నిబంధన మేరకు వాటిని నూజివీడు ఉప కలెక్టర్ ఆధ్వర్యంలో నూజివీడికి తరలించినట్లు వెల్లడించారు. ఇతర రాష్ట్రాల్లో సైతం ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో... ఏ క్షణమైనా రిజర్వ్ ఈవీఎంలను ఎన్నికల సంఘం అవసరం మేర రిజర్వ్ ఈవీఎంలను తరలిస్తుందని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీల నేతలకు సైతం సమాచారం ఇచ్చామని.....ఇందులో దీనిలో ఎలాంటి అనుమానాలకు తావులేదని తెలిపారు. కొంతమంది అవగాహన లేకుండా ఈ విషయాన్ని పెద్దది చేసి గందరగోళం చేసే ప్రయత్నం చేస్తున్నారని కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు.
ఇవీ చదవండి