కేంద్రం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని కోరుతూ కృష్ణాజిల్లా లారీ యజమానుల సంఘం ఆధ్వర్యంలో విజయవాడ బెంజ్ సర్కిల్లోని సంఘ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు.
పెట్రోలు, డీజిల్పై విధిస్తున్న అదనపు పన్నులను తొలగించి వ్యాట్ పరిధిలోకి తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ లారీ యజమానుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైవి ఈశ్వరరావు డిమాండ్ చేశారు. దేశంలో గత యాభై ఏళ్లలో ఏనాడు ఇలాంటి పరిస్థితి లేదని, లీటరుపై 11 రూపాయలు పెంచడానికి గల అంతర్జాతీయ పరిస్థితులు ఏమీ లేవని ఆయన తెలిపారు. వివిధ రకాల పన్నుల పేరుతో లీటరుపై 31 రూపాయలు వసూలు చేస్తోందని విమర్శించారు. ఇలా అయితే సామాన్యులు ఏమవ్వాలని ప్రశ్నించారు. కరోనా కారణంగా లారీలకు కిరాయిలు లేక యజమానులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం రవాణా వాహనాలకు కనీసం ఒక మూడు నెలలైనా రోడ్డు పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు.
ఇవీ చదవండి: 'ఇళ్ల పట్టాల పేరుతో పెద్ద ఎత్తున అవినీతి చేస్తున్నారు'