ap power finance corporation loans:ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ తీసుకున్న రుణానికిగానూ త్రైమాసికంగా వడ్డీ చెల్లింపులకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రూ. 210 కోట్ల రుణబాండ్లకు గానూ 3.21 కోట్ల రూపాయల వడ్డీని చెల్లించేందుకు పాలనా అనుమతి ఇస్తూ ఇంధన శాఖ కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. గతంలో జారీ చేసిన రుణబాండ్లకు గానూ త్రైమాసిక వడ్డీ చెల్లింపులకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.
వివిధ బ్యాంకుల నుంచి 5 వేల కోట్ల రూపాయల టెర్మ్ లోన్ తీసుకునేందుకు, అలాగే బాండ్ల జారీకి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు హామీ ఇచ్చింది. తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థల ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చేందుకుగానూ ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఆర్థిక వనరుల సమీకరణకు ప్రభుత్వం ఈ వెసులుబాటు కల్పించింది. 2020లో జారీ చేసిన 210 కోట్ల రూపాయల బాండ్లకుగానూ ఫిబ్రవరి మాసంతో ముగిసే త్రైమాసికానికి వడ్డీ చెల్లింపులకు ప్రభుత్వం పాలనానుమతి ఇచ్చింది.
ఇదీ చదవండి
CM Jagan slams Opposition Parties: 'ఉద్యోగులు సమ్మెలోకి వెళ్తే ప్రతిపక్షాలకు పండుగే'