ETV Bharat / state

రాష్ట్ర రహదారులపై టోల్ ఫీజులు వసూలుకు సిద్ధమైన ప్రభుత్వం

రాష్ట్రంలో పలు రాష్ట్ర రహదారులపై టోల్ ఫీజులు వసూలుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ విషయమై గతంలో ఉన్న నిబంధనలను మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదలైన తర్వాత ఈ ఫీజులు అమల్లోకి రానున్నాయి.

రాష్ట్ర రహదారులపై టోల్ ఫీజులు వసూలుకు సిద్ధమైన ప్రభుత్వం
రాష్ట్ర రహదారులపై టోల్ ఫీజులు వసూలుకు సిద్ధమైన ప్రభుత్వం
author img

By

Published : Nov 20, 2020, 6:32 AM IST

Updated : Nov 20, 2020, 6:49 AM IST

రాష్ట్ర రహదారులపై టోల్ ఫీజులు వసూలుకు సిద్ధమైన ప్రభుత్వం

రాష్ట్ర రహదారులపై రాకపోకలు సాగించేందుకు కార్లు, జీపులకు కిలోమీటర్‌కు 90 పైసలు, సరకు రవాణా చేసే తేలికపాటి వాహనాలు, మినీ బస్సులకు రూపాయి 80 పైసలు, బస్సు, లారీలకు 3 రూపాయల 55 పైసలు, భారీ వాహనాలకు 8 రూపాయల 90 చొప్పున టోల్ ఫీజులుగా పేర్కొంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. రాష్ట్రంలో పలు రాష్ట్ర రహదారులపై టోల్ ఫీజులు వసూలుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ విషయమై గతంలో ఉన్న నిబంధనలను మారుస్తూ.. ప్రభుత్వం గురువారం తాజా ఉత్తర్వులను జారీచేసింది. రాష్ట్ర రహదారులు, బైపాస్‌లు, వంతెనలు, సొరంగాల పరిధిలో టోల్‌ ప్లాజాలు ఏర్పాటు చేసి, ఫీజుల వసూలుకు 2019-20 సంవత్సర మూల ధరలను పరిగణనలోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు.

గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదలైన తర్వాత ఈ ఫీజులు అమల్లోకి వస్తాయన్నారు. రూ.20-25 కోట్లతో నిర్మించిన వంతెనలు, సొరంగాల వద్ద కార్లు, జీపులకు రూ.9, తేలికపాటి సరకు రవాణా వాహనాలకు రూ.13.50, బస్సు, లారీలకు రూ.27, భారీ వాహనాలకు రూ.39.60 చొప్పున ఖరారు చేశారు. నిర్మాణ వ్యయం రూ.25 కోట్లు దాటితే.. ప్రతి రూ.5 కోట్లకు ధర పెరుగుతుంది. ఏటా ఈ టోల్‌ ఛార్జీలను సమీక్షిస్తారు. ఫాస్టాగ్‌ సౌకర్యం కల్పిస్తారు. ఈ వాహనాలకు టోల్‌ప్లాజా వద్ద ప్రత్యేక లేన్‌ అందుబాటులోకి తెస్తారు.

ఫాస్టాగ్‌ లేకుండా, ఫాస్టాగ్‌ లేన్‌లో వచ్చిన వాహనానికి రెట్టింపు ఫీజు వసూలు చేస్తారు. పురపాలిక, పట్టణ ప్రాంతాలకు 10 కి.మీ. దూరంలో టోల్‌ప్లాజా ఏర్పాటు చేయాలి. టోల్‌ప్లాజాకు 5 కి.మీ. పరిధిలో ఉండే గ్రామాల్లో వాహనదారులకు టోల్‌ ఫీజుల నుంచి మినహాయింపు ఉంటుంది.ద్విచక్ర వాహనాలు, ఆటోలు, వ్యవసాయానికి ఉపయోగించే ట్రాక్టర్లకు టోల్‌ ఫీజు ఉండదు.

జాతీయ రహదారులపై టోల్‌ ఫీజుల మినహాయింపు ఉండేవారందరికీ ఇక్కడా మినహాయింపు ఉంటుంది. టోల్‌ ప్లాజా సంబంధిత ఆర్‌అండ్‌బీ ఈఈ పర్యవేక్షణలో ఉంటుంది. టోల్‌ ప్లాజా ఉందని వెయ్యి మీటర్ల దూరంలోనే ఇంగ్లిష్, హిందీలోనూ, 500 మీటర్ల దూరంలో తెలుగులో బోర్డులు ఏర్పాటుచేయాలి. జాతీయ రహదారులపై అమలు చేస్తున్నట్లుగానే 24 గంటల్లోపు రాకపోకలకు టోల్‌ ఫీజు తగ్గింపు, నెలవారీ పాస్‌ల వంటి నిబంధనలు వీటిలోనూ అమలుచేస్తారు.

ఇదీ చదవండి

ఎట్టిపరిస్థితుల్లోనూ స్థానిక ఎన్నికలను అనుమతించకూడదు!

Last Updated : Nov 20, 2020, 6:49 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.