రాష్ట్రంలో ఫుడ్ సేఫ్టీ ల్యాబ్‌లను ఏర్పాటు చేయాలని సొసైటీ ఫర్ సేఫ్ ఫుడ్ రాష్ట్ర కార్యదర్శి సిహెచ్. లక్ష్మి కిరణ్ కోరారు. ఫుడ్ సేఫ్టీ విభాగంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలన్నారు. లక్ష మందికి ఒక ఫుడ్ సేఫ్టీ అధికారి ఉండాలని.. కానీ రాష్ట్రం మొత్తంలో 33 మంది అధికారులే ఉండడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి దర్పణమని అన్నారు. రాష్ట్రం విడిపోయాక ఇప్పటివరకు ఓ మొబైల్ ల్యాబ్‌ను కూడా ఏర్పాటు చేయలేకపోరన్నారు.
కల్తీ ఆహారాన్ని నివారించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అవతరణ దినోత్సవం సందర్భంగా సొసైటీ ఫర్ సేఫ్ సేఫ్ ఫుడ్ అంశంపై ప్రజల్లో అవగాహన కల్పించేలా కార్యక్రమాలు నిర్వహిస్తామని లక్ష్మి కిరణ్ అన్నారు. ఇప్పటికైనా ఆహార భద్రత ప్రమామాలను పాటించాలని.. సురక్షిత ఆహారం అందరికి అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇదీ చదవండి: