కృష్ణా జిల్లా విజయవాడలోని అమృతహస్తం చారిటబుల్ ట్రస్ట్ దాదాపుగా దశాబ్ద కాలంగా అన్నార్తులకు ఆపన్నహస్తం అందిస్తోంది. కరోనా కష్టకాలంలోనూ మేమున్నామటూ లక్షలాది మంది ఆకలి తీరుస్తోంది. కార్మికులు, కూలీలు... ఇలా అందరికీ నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తోంది. లాక్డౌన్తో ఉపాధి కోల్పోయిన వలస కార్మికులకు ఆహారాన్నీ అందించారు. ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన శ్రామిక రైళ్లలో... విజయవాడ నుంచి వెళ్లే వారికి ఆహార, పానీయాలు అందించి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. కరోనా సంక్షోభంలోనూ, అమృతహస్తం సభ్యులు దాతల సహకారంతో, 92 రోజుల పాటు... దాదాపు 9లక్షల మంది ఆకలి తీర్చారు. ఇప్పటివరకు 30 వేల మందికి సరిపడా ఆహార పానియాలు అందించారు.
విజయవాడ నుంచి ఈరోజు చివరి శ్రామిక్ రైలు వెళ్లడంతో, ఇన్కంటాక్స్ చీఫ్ కమిషనర్ పీయూష్ కుమార్, ఐటీసీ అందించిన సహకారంతో వలస కూలీలకు ఆహార పానియాలు అందించినట్లు అమృతహస్తం డైరెక్టర్ ధారా కరుణశ్రీ తెలిపారు.
ఇవీ చూడండి:కరోనా ప్రభావం: పాఠశాలల పునఃప్రారంభంపై కొనసాగుతున్న అయోమయం