అమరావతి రైతులకు సంఘీభావం తెలిపేందుకు కర్ణాటక నుంచి వచ్చిన రైతులను పోలీసులు నిర్భంధించడం అమానుషమని అమరావతి జేఏసీ కన్వీనర్ శివారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఆంక్షలు , అక్రమ అరెస్టుల ద్వారా ఉద్యమాన్ని ఆపలేరని స్పష్టం చేశారు. తన మాట చెల్లుబాటు కావడం లేదని ఏకంగా శాసన మండలినే రద్దు చేయడానికి సిద్ధపడటం సీఎం జగన్ అధికార దురంహకారానికి అద్దం పడుతోందన్నారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాల పట్ల ప్రభుత్వం ఇప్పటికైనా పునరాలోచించుకోవాలని ఆయన సూచించారు.
ఇవీ చూడండీ : మండలిపై రూపాయి ఖర్చైనా దండగే: సీఎం జగన్