ఆంధ్రా బ్యాంక్ విలీన నిర్ణయాన్ని అన్ని పార్టీల నేతలు ముక్తకంఠంతో వ్యతిరేకించారు. విజయవాడ దాసరి భవన్ లో నిర్వహించినఅఖిలపక్ష సమావేశంలో వామపక్ష నేతలు మధు, రామకృష్ణ తోపాటు, పీసీసీ ఉపాధ్యక్షులు తులసిరెడ్డి, టీడీపీ నేత వర్ల రామయ్య , బ్యాంక్ ఉద్యోగులు, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. జి.డి.పి తిరోగమనంను కప్పిపుచ్చడానికే,కేంద్రం ఈ తప్పుడు నిర్ణయం తీసుకుందని రామకృష్ణ ఆరోపించారు. సీతారామయ్య ఆంధ్రా బ్యాంక్ ను స్థాపిస్తే,ఆంధ్ర కోడలు సీతారామన్ బ్యాంకును మూసివేసేందుకు యత్నిస్తున్నారని తులసిరెడ్డి ఎద్దేవా చేశారు. ఆంధ్రా బ్యాంక్ విలీనంపై ఆంధ్రుల అత్మాభిమానాకి మచ్చవంటిదని వర్ల రామయ్య అన్నారు. విలీన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు చేస్తామని అఖిలపక్షనేతలు హెచ్చరించారు.
ఇవీ చదవండి...విలీనం తప్పదంటే... 'ఆంధ్రాబ్యాంక్'గానే కొనసాగించండి!