కృష్ణా జిల్లా ఉయ్యూరులో బ్యాంకు ముందు చెత్తవేయటాన్ని బ్యాంకు ఉద్యోగుల సంఘం తీవ్రంగా ఖండించిది. బ్యాంకుల ముందు చెత్తపోయటం అరాచకానికి నిదర్శనమని ఏఐబీఈఏ నాయకుడు మండిపడ్డారు. బ్యాంకులను లక్ష్యం చేసుకోవటం కనీవినీ ఎరుగనిదన్నారు. మున్సిపల్ అధికారులే వెనకుండి చెత్త వేయించటం దారుణమన్నారు.
రాష్ట్రంలో అరాచక శక్తులు రాజ్యమేలుతున్నాయనే భావన కలుగుతోందన్నారు. జగనన్న తోడు పథకాలకు రుణాలు ఇవ్వలేదనే క్షక్షతో చెత్తపోస్తారా? అని నిలదీశారు. మేం చెప్పిన వాళ్లకే రుణాలు ఇవ్వాలనడం ఏవిధంగా సబబు ? అని ఏఐబీఈఏ ప్రశ్నించింది.
ఇదీచదవండి