రాష్ట్రంలో సినిమా, టీవీ సీరియల్స్ షూటింగ్కు అనుమతిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. నిర్దేశిత కాషన్ డిపాజిట్ చెల్లింపు అనంతరం షూటింగ్లకు అనుమతి ఇస్తూ ఆదేశాలు ఇచ్చారు. లాక్డౌన్ అనంతరం తిరిగి సాధారణ కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు వీలుగా రాష్ట్రంలో షూటింగ్లకు అనుమతి ఇస్తూ ఆదేశాలు వెలువడ్డాయి.
ఏపీ ఫిల్మ్ అండ్ టీవీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇచ్చే అనుమతి మేరకు ఉచితంగా షూటింగ్ చేసుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొంది. కేటగిరీల వారీగా కాషన్ డిపాజిట్ ఫీజును రూ.15, 10, 5వేలు చెల్లించాలని ప్రభుత్వం పేర్కొంది.
ఇదీచూడండి. రేపటి నుంచి బస్సు సర్వీసులు ప్రారంభం: ఆర్టీసీ ఎండీ