కృష్ణా జిల్లా మచిలీపట్నం సబ్ ట్రెజరీ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కార్యాలయంలో 2016 నుంచి ఎస్టీవోగా పనిచేస్తున్న నాగమల్లేశ్వరరావుపై వివిధ ఫిర్యాదులు అందడంతో ఏసీబీ ఏఎస్పీ ఉమమహేశ్వరరాజు నేతృత్వంలో సోదాలు నిర్వహించారు. కార్యాలయ సిబ్బంది వద్ద లెక్కల్లోకిని రాని నగదు ఉండడంతో వాటిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. తనిఖీ నివేదికను ఉన్నతాధికారులకు ఇస్తామని ఏఎస్పీ తెలిపారు.
ఇదీ చదవండి: చూశారా మీరు?!: చెట్టులో ఇల్లు.. ఎంత వింతగా ఉందో!