ETV Bharat / state

ఇద్దరి పిల్లలతో కాలువలోకి దూకిన తల్లి

ఏం జరిగిందో ఏమో... ఆ తల్లికి అసలేం కష్టమోచ్చిందో!. తన ఇద్దరి పిల్లలతో సహా ఓ కాల్వలో దూకేసింది. తల్లి ప్రాణాలు విడిచింది. పిల్లల్ని అనాథల్ని చేసింది. ఈ ఘటన విజయవాడలోని కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

a mother sucide with her two childern at krishnalanka in vijayawada, krishna district

author img

By

Published : Jun 4, 2020, 10:13 AM IST

Updated : Jun 5, 2020, 5:31 PM IST

భార్యాభర్తల మధ్య తలెత్తిన మనస్పర్థలతో.. క్షణికావేశంలో ఓ వివాహిత తన పిల్లలతో సహా కాల్వలోకి దూకింది. ఈ ఘటనలో పిల్లలు తప్పించుకోగా, ఆ మహిళ మృత్యువాత పడింది. గురువారం ఉదయం విజయవాడ కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ ఉదంతం చోటుచేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం మోర్త గ్రామానికి చెందిన రాచమళ్ల స్వరూపరాణి (32), శ్రీనివాసరావులకు 14ఏళ్ల కిందట వివాహమైంది. వారికి అభిషేక్‌ (13), కీర్తన (12) సంతానం. ఇటీవల భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన స్వరూపరాణి పిల్లలిద్దరినీ వెంటబెట్టుకుని బుధవారం 10గంటలకు ఇంటి నుంచి బయలుదేరి మధ్యాహ్నం ఒంటి గంటకు విజయవాడ బస్టాండుకు చేరుకుంది. అక్కడి నుంచి దుర్గాఘాట్‌, ప్రకాశం బ్యారేజీ తదితర ప్రదేశాల్లో తిరిగి సాయంత్రానికి పిల్లలిద్దరితో విజయవాడ నగరపాలక సంస్థ సమీపంలోని బందరుకాలువ వద్దకు చేరుకుంది. గురువారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో పిల్లలిద్దరినీ బలవంతంగా కాలువలోకి లాక్కెళ్లి చేతులతో వారిని నీటిలోకి అదిమి తాను కూడా మునిగింది. కాల్వలో నీటిమట్టం 4 అడుగులకు మించకపోవడం, ప్రవాహ వేగం లేకపోవడంతో పిల్లలిద్దరూ తల్లి నుంచి తప్పించుకుని ఒడ్డుకు చేరుకున్నారు. స్వరూపరాణి మాత్రం నీటిలోనే మునిగి ప్రాణాలు విడిచారు. కుమార్తె కీర్తన పైకి వచ్చి సమీపంలోనికి వారికి విషయాన్ని వివరించడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనాస్థలానికి చేరుకుని వివాహిత మృతదేహాన్ని వెలికితీశారు.

ఒకరి ఆచూకీ మరొకరికి తెలియక తల్లడిల్లిన అన్నాచెల్లెళ్లు

ఒడ్డుకు చేరుకున్న కీర్తనకు తన అన్నయ్య అభిషేక్‌ తప్పించుకున్న విషయం తెలియకపోవడంతో ఏడుస్తూ తన తల్లితో పాటు అన్నయ్య నీటిలో మునిగిపోయినట్లుగా చెప్పడంతో స్థానికులు కాల్వలో గాలింపు చర్యలు చేపట్టారు. అతని ఆచూకీ లభ్యం కాలేదు. అయితే తల్లి నుంచి తప్పించుకున్న అభిషేక్‌ బస్‌స్టేషన్‌కు చేరుకుని రాజమహేంద్రవరం బస్సెక్కి తన పక్కన ఉన్న ప్రయాణికుడితో తన తల్లి, చెల్లెలు నీటిలో మునిగిపోయారని చెప్పి, సెల్‌ఫోన్‌ అడిగి, కుటుంబసభ్యులకు సమాచారం అందించాడు. వారి ద్వారా అభిషేక్‌ క్షేమంగా ఉన్నట్లు తెలుసుకున్న పోలీసులు విషయాన్ని కీర్తనకు చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఘటన సంభవించిన కొద్ది గంటల వ్యవధి వరకూ ఒకరి ఆచూకీ మరొకరికి తెలియక అన్నాచెల్లెళ్లు తల్లడిల్లిపోయారు.

మోర్తలో విషాదం :

నాగస్వరూపారాణి ఆత్మహత్యకు పాల్పడటంతో ఆమె స్వగ్రామం మోర్తలో విషాద ఛాయలు అలముకున్నాయి. మృతురాలి తల్లిదండ్రులు, భర్త గ్రామం కూడా ఇదే. తల్లిదండ్రులు చిటికన దుర్గారావు, ఆదిలక్ష్మికి ఇటీవల గుండె సంబంధిత శస్త్ర చికిత్సలు అవటంతో కుమార్తె మృతి విషయాన్ని తొలుత వారికి తెలియనివ్వలేదు. నాగస్వరూపారాణి ఈనెల 3న ఉదయం తన కుమారుడు, కుమార్తెను వెంటబెట్టుకొని భీమవరం పెన్నాడపాలెంలోని తన సోదరి ఇంటికి వెళుతున్నానని చెప్పి వెళ్లినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. ఆ రోజు మధ్యాహ్నానికి కూడా అక్కడకు చేరుకోకపోవటంతో తల్లిదండ్రులు వారి చిన్న కుమార్తెకు ఫోన్‌ చేశారు. తమ వద్దకు రాలేదని చెప్పటంతో ఆందోళనకు గురయ్యారు. తన భార్య కనిపించటం లేదని మృతురాలి భర్త రాచమళ్ల శ్రీనివాసు బుధవారం రాత్రి ఉండ్రాజవరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకుని హుటాహుటిన బయల్దేరి వెళ్లారు.

ఇదీ చదవండి: బెజవాడ గ్యాంగ్​ వార్​పై లోతైన దర్యాప్తు

Last Updated : Jun 5, 2020, 5:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.