కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం వేదాద్రి కృష్ణా నదిలో 18 ఏళ్ల జవ్వాజి అజయ్ ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తూ మరణించాడు. వేదాద్రి గ్రామానికి చెందిన అజయ్.. మరో ఇద్దరు యువకులు ఈతకు వెళ్లగా.. నదిలో ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. పట్టు తప్పిన అజయ్.. నీటిలో మునిగి చనిపోయాడు. మిగిలిన ఇద్దరు యువకులు బయటపడ్డారు. పోలీసులు మృతదేహాన్ని బయటకు తీయించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: