ETV Bharat / state

చంద్రబాబు పర్యటనలో అపశృతి.. గోదావరిలో పడిన తెదేపా నేతలు - TDP leaders fell into water after being hit by boats news

చంద్రబాబు పర్యటనలో అపశృతి
చంద్రబాబు పర్యటనలో అపశృతి
author img

By

Published : Jul 21, 2022, 6:21 PM IST

Updated : Jul 21, 2022, 7:20 PM IST

18:18 July 21

పడవలు ఢీకొని గోదావరిలో పడిన తెదేపా నేతలు

చంద్రబాబు పర్యటనలో అపశృతి

తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు పర్యటనలో అపశ్రుతి చోటు చేసుకుంది. పంటు ఢీకొనడంతో పడవలో ఉన్న కొందరు తెదేపా సీనియర్‌ నేతలు నదిలో పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు, మత్స్యకారులు లైఫ్ జాకెట్ల సాయంతో వారిని సురక్షితంగా కాపాడారు.

పశ్చిమగోదావరి, కోనసీమ జిల్లాలో వరద బాధితులను చంద్రబాబు పరామర్శిస్తున్నారు. చంద్రబాబుతో పాటు పలువురు తెదేపా నేతలు ఈరోజు సాయంత్రం రాజోలులంక చేరుకున్న క్రమంలో పడవ ప్రమాదం జరిగింది. కోనసీమ జిల్లా సోంపల్లి వద్ద చంద్రబాబు ప్రయాణిస్తున్న పంటులో నుంచి దిగి రాజోలు లంక వెళ్లేందుకు మరపడవలోకి మారాల్సి వచ్చింది. మర పడవలో చంద్రబాబు వెళ్తుండగా... ఆయనతో పాటు మరో పడవలో తెదేపా నేతలు వెళ్లేందుకు అందరూ ఒక్కసారిగా పంటు చివరకు రావడంతో అదుపుతప్పి మరో బోటును ఢీకొంది.

ఈఘటనలో మాజీ మంత్రులు పితాని సత్యనారాయణ, దేవినేని ఉమా, ఉండి ఎమ్మెల్యే రామరాజు, ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు, తణుకు మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణ, కొందరు మీడియా ప్రతినిధులు, భద్రతా సిబ్బంది ఒక్కసారిగా నీటిలో పడిపోయారు. నదికి సమీపంలోనే ఈ ఘటన జరగడంతో పెను ప్రమాదం తప్పింది. లైఫ్‌జాకెట్ల సాయంతో నీటిలో పడిపోయిన వారిని సురక్షితంగా కాపాడారు. అందరూ ఒడ్డుకు చేరిన తర్వాత చంద్రబాబు రాజోలులంక బయల్దేరారు.

ఇవీ చూడండి

Last Updated : Jul 21, 2022, 7:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.