రోడ్లు, డ్రైన్లు వేయలేకపోవడం వల్ల తన ప్రాంత ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నానని.. కోనసీమ జిల్లా కొత్తపేటకు చెందిన ఎంపీటీసీ సభ్యుడు రాజీనామాకు సిద్ధమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపా మద్దతుదారుడుగా పోటీ చేసి బ్రహ్మానందం తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాజీనామా పత్రాన్ని ఎంపీడీవో మహేష్ కు ఇవ్వగా... తనకు ఆ అధికారం లేదని ఆయన తిరస్కరించారు. వైకాపా నాయకులు బుజ్జగించడంతో తన రాజీనామాను ఉపసంహరించుకున్నట్లు ఎంపీటీసీ బ్రహ్మానందం తెలిపారు.
ఇవి చదవండి:
- పిల్లల భాష, ఉచ్చరణపై మరింత శ్రద్ధ పెట్టాలి: సీఎం జగన్
- న్యాయవాదులపై పెట్టే శ్రద్ధ పర్యావరణంపై పెట్టలేరా?.. ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ప్రశ్న
- Ponniyan Selvan: త్రిష ధరించిన నగల వెనక పెద్ద కథే ఉందిగా!