ETV Bharat / state

తన గొంతు నొక్కారంటూ.. పోలీసులకు ఫిర్యాదు చేసిన అమరావతి మహిళా రైతు - Maha Padayatra turns violent in Andhra pradesh

Amaravati Farmers: పాదయాత్రలో పాల్గొన్నవారిపై పోలీసులు వ్యవహరించిన తీరుతో అన్నపూర్ణ అనే మహిళ రైతుకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో మహిళా రైతును అసుపత్రికి తరలించారు. తన గొంతు నొక్కి, నెట్టివేయడంతోనే తాను తీవ్రంగా గాయపడినట్లు ఆమె రామచంద్రాపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం మహిళా రైతు కాకినాడ జీజీహెచ్ లో చికిత్స పొందుతున్నారు.

Woman injured in police attack
పాదయాత్ర
author img

By

Published : Oct 23, 2022, 1:37 PM IST

Maha Padayatra డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రాయవరం మండలం పసలపూడి వద్ద శుక్రవారం నాడు పోలీసులు తనను తీవ్రంగా గాయపరిచారని, రామచంద్రాపురం పోలీస్ స్టేషన్లో అన్నపూర్ణ అనే మహిళ రైతు ఫిర్యాదు చేశారు. తోపులాటలో ఓ అధికారిపై తన చేయి పడిందని, తన పైనే చేయి వేస్తావా అంటూ సదరు అధికారి తోసేశారని ఆమె చెప్పారు. గొంతు నొక్కి చేతులు వెనక్కిమడిచి నెట్టేయడంతో కిందపడి పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తాను తీవ్రంగా గాయపడినట్లు మహిళా రైతు తెలిపారు. ప్రస్తుతం కాకినాడ జీజీహెచ్ లో చికిత్స పొందుతున్నా.. మహిళా రైతు అన్నపూర్ణను తెదేపా మాజీ ఎమ్మెల్యే కొండబాబు పరామర్శించారు.

అమరావతి మహాపాదయాత్రలో పాల్గొన్న మహిళా రైతు జమ్ముల అన్నపూర్ణ

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.