Talented kid : కోనసీమ జిల్లా రాజోలు మండలం పొదలాడకు చెందిన 9 ఏళ్ల పెసింగి సచిన్ స్థానికంగా ఓ ప్రైవేటు పాఠశాలలో 4వ తరగతి చదువుతున్నాడు. తండ్రి వరప్రసాద్ డిగ్రీ చదివి పోటీ పరీక్షలకు ప్రయత్నించి సరైన అవకాశాలు రాకపోవడంతో ఉపాధి నిమిత్తం గల్ఫ్‌కు వెళ్లి రెండేళ్ల క్రితం ఇంటికి వచ్చేశారు. ఈ నేపథ్యంలో తనకున్న అనుభవంతో తన కుమారుడు సచిన్‌కు అప్పుడప్పుడు క్యాలెండర్ లెక్కలు, సుడోకులో శిక్షణ ఇచ్చాడు. అలా రెండేళ్ల నుంచి తన తండ్రి నుంచి శిక్షణ తీసుకున్న సచిన్ కొత్త ట్రిక్స్ ఉపయోగించి క్యాలెండర్‌లో 16వందల సంవత్సరం నుంచి రాబోయే సంవత్సరాలలోని ఏ తేదీని అడిగినా క్షణాల్లో గణన చేసి చెప్తూ అబ్బురపరుస్తున్నాడు. వేగంగా క్యూబ్స్ అమరిక, మూలకల ఆవర్తన పట్టికలో 118 మూలకాలను కింది నుంచి పైకి.. పైనుంచి కిందికి ఎలా అడిగినా మూలకాల పేర్లు చెప్తున్నాడు. ఇలా చెప్తున్న పలు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
"కరోనా కారణంగా మళ్లీ గల్ఫ్ వెళ్లలేకపోయాను. అప్పటినుంచి మా అబ్బాయికి నాకు తెలిసిన క్యాలెండర్, క్యూబ్స్, సుడోకు గురించి నేర్పించాను. ఫ్లిప్‌కార్ట్ సంస్థ ఇచ్చిన జ్ఞాపిక మాత్రమే కాకుండా..లిమ్కా బుక్ రికార్డుకు ఇటీవల నమోదు చేశాము. గిన్నిస్ రికార్డు సాధించే దిశగా సిద్ధం చేస్తున్న" -వరప్రసాద్, సచిన్ తండ్రి
బుడతడి ప్రతిభను సామాజిక మాధ్యమాల్లో చూసి.. ప్రతిభను పరిశీలించిన ఫ్లిప్‌కార్ట్ సంస్థ జ్ఞాపిక అందించింది. ఇదే కాకుండా సచిన్ చదువుతున్న పాఠశాల కూడా ఇంటర్మీడియట్ వరకు ఉచితంగా విద్య అందించేందుకు ముందుకు వచ్చింది.
ఇవీ చదవండి: