ETV Bharat / state

200 police deployed in Amalapuram: ఆ రెండు ఘటనలతో.. పోలీసు వలయంలో అమలాపురం - Youth Question To Vishwaroop Son Srikanth

200 Police Deployed in Amalapuram : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో మూడు రోజుల వ్యవధిలో చోటు చేసుకున్న రెండు వేరువేరు సంఘటనలకు సంబంధించి ముందు జాగ్రత్త చర్యగా పట్నంలో పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు ఎస్పీ సుసారపు శ్రీధర్. క్షేత్రస్థాయిలో బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. సుమారు 200 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. పలుచోట్ల పోలీసు పికెట్లు ఏర్పాటు చేసి వివరాలు సేకరిస్తున్నారు.

policemen_deployed_in_Amalapuram
policemen_deployed_in_Amalapuram
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 2, 2023, 12:13 PM IST

Updated : Sep 2, 2023, 2:08 PM IST

200 police deployed in Amalapuram: ఆ రెండు ఘటనలతో.. పోలీసు వలయంలో అమలాపురం

200 Police Deployed in Amalapuram : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురం మండలం ఈదరపల్లిలో గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త పోలిశెట్టి కిషోర్‌ (28), అడపా సాయి లక్ష్మణ్‌ (26) గురువారం రాత్రి కొందరు యువకులపై దాడి చేశారు. ప్రతీకారంగా అవతలి వర్గం యువకులు శుక్రవారం మధ్యాహ్నం కర్రలతో వచ్చి వీరిద్దరినీ కొట్టారు. ఈ ఘటనలో కిషోర్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. సాయి లక్ష్మణ్‌ తీవ్రంగా గాయపడ్డాడు. కిషోర్‌ మృతదేహాన్ని అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడికి వైసీపీ నాయకులు, కార్యకర్తలు తరలిరావడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ఈ దాడి ఘటనతో కొంకాపల్లికి చెందిన ఆనంద్‌, గూడాలకు చెందిన సుధీర్‌, ఈదరపల్లికి చెందిన సతీష్‌, ఇంద్ర, అనే యువకులకు సంబంధం ఉన్నట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. మధ్యాహ్నం హత్య జరగడం, సాయంత్రం తరువాత పట్టణంలో మరో పార్టీ నాయకుడికి చెందిన దుకాణానికి దుండగులు నిప్పుపెట్టడంతో కలకలం రేగింది. దీంతో 200 మంది పోలీసులతో పట్టణంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

మంత్రి కుమారుడిని నిలదీసిన యువకులు.. అరెస్టు : గత నెల 31న రాష్ట్ర మంత్రి విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం (Gadapa Gadapaku Mana Prabhutvam Program) కోసం అమలాపురం మండలం కామనగరువు వెళ్లినప్పుడు ఆయనకు స్థానికుల నుంచి చేదు అనుభవం ఎదురయింది. 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమానికి 'మీ నాన్న రావాలి కదా' అని మంత్రి కుమారుడిని పలువురు యువకులు ప్రశ్నించారు (Youth Question To Vishwaroop Son Srikanth). ఆ యువకులను పోలీసులు రోజంతా పోలీసు స్టేషన్‌లో నిర్బంధించారు. కామనగరువులోని విత్తనాలవారి కాలువగట్టు వద్దకు గురువారం శ్రీకాంత్‌ వచ్చారు. స్థానిక యువకులు మామిడిశెట్టి బాలు, చిట్టూరి ప్రసాద్‌, దొమ్మేటి శ్రీనివాస్‌లు 'మీ నాన్న రావాల్సింది. మీరెందుకు వచ్చారు' అని శ్రీకాంత్‌ను ప్రశ్నించారు.

Protest Aganist Minister Vishwaroop Son Srikanth: గడపగడపలో మంత్రి విశ్వరూప్‌ కుమారుణ్ని నిలదీసిన స్థానికులు.. పక్కకు తీసుకెళ్లిన అధికారులు

ముగ్గురు యువకులపై కేసు నమోదు : కోనసీమ జిల్లా పేరు మార్పు విషయంలో అమలాపురంలో జరిగిన అల్లర్ల కేసుల్లో సంఘటనల్లో తమ వారిని అన్యాయంగా ఇరికించారని మహిళలు, స్థానికులు ఆయనను గట్టిగా నిలదీశారు. దీన్ని దృష్టిలోపెట్టుకొని వైసీపీ పట్టణ అధ్యక్షుడు సంసాని చంద్రశేఖర్‌, పమ్మి తాతాజీ, మెండు రమేష్‌బాబు, సంసాని బాబీలు సాయంత్రం తనను బెదిరించారని, ప్రాణహాని ఉందని దొమ్మేటి శ్రీనివాస్‌ ఆరోపించారు. దీనిపై పోలీసులకూ ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే అదే రోజు సాయంత్రం ముగ్గురు యువకులపై కేసు నమోదు చేశారు. అనంతరం తాలుకా పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు. స్థానికులు, కుటుంబ సభ్యులు స్టేషన్‌ వెళ్లి బైఠాయించడంతో అర్ధరాత్రి 2 గంటలకు వదిలిపెట్టారు. మళ్లీ శుక్రవారం ఉదయం 6 గంటలకు వారిని మళ్లీ స్టేషన్‌కు పిలిచారు. రాత్రి వరకూ స్టేషన్‌లోనే ఉంచారు.

యువకులను విడిచి పెట్టాలని ఆందోళన : పోలీస్ స్టేషన్​ వచ్చిన ఆ ముగ్గురుని పోలీసులు పంపకపోవడంతో స్థానిక మహిళలు పోలీస్ స్టేషన్​కు వచ్చి రాత్రి 11 గంటల వరకు నిరీక్షణ చేశారు. అయినా వారిని విడిచిపెట్టలేదు. ఈ నేపథ్యంలో స్థానిక వైసీపీ నాయకుడు సుభాష్​తో పాటు అనేక మంది యువకులు పోలీస్ స్టేషన్ వచ్చి ఆందోళనకు దిగారు. మరో వైపు శుక్రవారం కామనగరువు మిక్చర్‌కాలనీలో శ్రీకాంత్‌ పోలీస్‌ బందోబస్తు మధ్య 'గడపగడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇలా వేరువేరు సంఘటనలు చోటు చేసుకోవడంతో 200 మంది పోలీసులతో పట్టణంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. క్షేత్రస్థాయిలో ఏలూరు రేంజ్‌ డీఐజీ అశోక్‌, ఎస్పీలు శ్రీధర్‌, రవిప్రకాశ్‌ పరిశీలించారు. అమలాపురం పట్టణం ప్రస్తుతం పోలీసు వలయంగా మారింది.

Gadapa Gadapaku Program: 'గడప గడపకు మన ప్రభుత్వం'లో ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డిపై ప్రశ్నల వర్షం..

Last Updated : Sep 2, 2023, 2:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.