ETV Bharat / state

Wedding Cost in Annavaram : సత్యదేవుడి సన్నిధిలో నిలువు దోపిడీ.. పెళ్లి బృందాలపై చార్జీల మోత

Wedding cost in Annavaram : అన్నవరంలో పెళ్లంటే ఓసారి ఆలోచించుకోవాల్సిందే అంటున్నాయి.. పెళ్లి బృందాలు. భోజనాలు తీసుకెళ్లాలంటే.. చార్జీల పేరుతో అంతకు మించి వసూలు చేస్తున్నారంటూ మండిపడుతున్నాయి. పారిశుధ్య సమస్య సాకుగా చూపించి నిలవుదోపిడీ చేస్తున్నారంటూ భక్తులు మండిపడుతున్నారు.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 7, 2023, 1:33 PM IST

Wedding Cost in Annavaram : సత్యదేవుడి సన్నిధిలో నిలువు దోపిడీ.. పెళ్లి బృందాలపై చార్జీల మోత

Wedding cost in Annavaram : అన్నవరం సత్యదేవుడి సన్నిధిలో వివాహాలంటేనే... పేదలు జంకే పరిస్థితి దాపురించింది. కొండపైకి వచ్చిన అతిథులకు కడుపారా భోజనం పెట్టేందుకు భయపడాల్సి వస్తోంది. కొండపై ఆహార పదార్థాలు కొనే స్థోమత లేక ఇంటి వద్దే వండించుకుని తీసుకెళ్తే టోల్‌ రుసుము పేరిట వేలల్లో బాదుతున్నారు. ఆహారం కంటే కూడా ఆ ఛార్జీల మోతే మోగిపోతుంది. వ్యయప్రయాసలకోర్చి దేవుడి సన్నిధానంలో కల్యాణం చేసుకుందామంటే... దేవస్థానం అధికారులు సాయం చేయకుండా ఆవేదన మిగుల్చుతున్నారని పెళ్లి బృందాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

Plastic Ban in Annavaram Temple: అన్నవరంలో ప్లాస్టిక్ నిషేధం.. కట్టుదిట్టంగా తనిఖీలు..

అన్నవరం సత్యదేవుని సన్నిధిలో వివాహాలు చేసుకునేందుకు రాష్ట్రంలోనే కాక ఇతర ప్రాంతాల నుంచి అనేకమంది తరలివస్తుంటారు. ఇలాంటి వారికి దేవస్థానం అధికారులు సహకారం అందించాల్సింది పోయి ఇబ్బంది పెడుతున్నారు. కొండపై పెళ్లంటేనే.. వామ్మో అనేలా తయారు చేశారు. పేద, మధ్య తరగతి కుటుంబాలు కొండపై భోజనాలు కొనుగోలు చేసి, పెళ్లి చేసుకోవాలంటే ఆర్థికం భారం. దీంతో టిఫిన్, భోజనాలు ఇంటి నుంచి లేదా బయట తెచ్చుకుంటారు. దీన్నే అదునుగా భావించిన దేవస్థానం సిబ్బంది... కొండపైకి భోజనాలు తీసుకెళ్లేవారిపై టోల్‌ రుసుము అంటూ ముక్కుపిండి చేస్తున్నారు. కొండపై రెండు క్యాంటీన్లు ఉన్నాయి. పెళ్లి బృందాలు వీరివద్ద భోజనాలు బుక్‌ చేసుకోవచ్చు. బయట నుంచీ తెచ్చుకోవచ్చు. అలా తీసుకెళ్తే గతంలో 3వేల రుసుము చెల్లించాల్సి ఉండగా ప్రస్తుతం 6 వేలకు పెంచి దండుకుంటున్నారు.

అన్నవరం ఆలయానికి పోటెత్తిన భక్తులు.. నిండిన క్యూలైన్లు

కాకినాడకు చెందిన ఓ జంటకు కొండపై వివాహం జరిగింది. కుటుంబసభ్యులు ఇంటి వద్ద భోజనాలు వండి కొండపైకి తీసుకెళ్తుండగా ఘాట్‌ రోడ్డు టోల్‌గేటు వద్ద సిబ్బంది అడ్డుకున్నారు. 6 వేలు కట్టాల్సిందేనని ఒత్తిడి చేశారు. పిల్లల కోసం భోజనాలు తీసుకెళ్తున్నామని చెప్పినా ససేమిరా అన్నారు. ఇంత భారీగా రుసుము ఏంటంటూ సిబ్బందితో పెళ్లివారు వాగ్వాదానికి దిగారు. సిబ్బంది తీరుతో విసిగిపోయి ఆహారాన్ని టోల్‌గేటు వద్దే పడేసి వెళ్లిపోయారు. అనకాపల్లికి చెందిన ఓ పెళ్లి బృందం అతిథుల కోసం 3 వేల 200 పెట్టి టిఫిన్ కొనుక్కొని తీసుకెళ్తుండగా.. టోల్‌గేటు వద్ద సిబ్బంది అడ్డుకున్నారు. కొండపైకి తీసుకెళ్లాలంటే 3 వేలు చెల్లించాలని తేల్చిచెప్పారు. కొన్న ఆహారం విలువను మించి టోల్‌ రుసుము అడిగితే ఎలా అని ప్రశ్నించారు. ఆర్థిక భారంతో చివరికి టిఫిన్ తీసుకెళ్లకుండానే వెనుదిరిగారు.

అన్నవరంలో ప్లాస్టిక్ నిషేధించారు. సమాచారం తెలియక చాలా మంది ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు తీసుకెళ్లడంతో అనుమతించలేదు. నీటి సీసాలను కొండపై 40నుంచి 45 రూపాయలకు విక్రయిస్తూ జేబులు నింపుకుంటున్నారు. మండపాలు, గదులు కూడా దొరకనీయకుండా సామాన్యులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. అన్నవరంలో వివాహాలు చేసుకున్న భక్తుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు.

ఇతర దేవస్థానాల్లో వివాహాలు చేసుకున్నవారు బయట నుంచి ఆహారం తీసుకెళ్తే రుసుము చెల్లించనవసరం లేదు. కానీ అన్నవరంలో మాత్రం 6 వేలు వసూలు చేస్తున్నారు. అధిక ఆదాయం కోసం పారిశుద్ధ్య నిర్వహణను సాకుగా చూపి భారం మోపడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొండపై ప్రైవేటు వ్యాపారులను ప్రోత్సహించే విధంగా అధికారుల తీరుందని భక్తులు మండిపడుతున్నారు.

అన్నవరం సత్యనారాయణ స్వామి గిరి ప్రదక్షిణ.. భారీగా పాల్గొన్న భక్తులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.