ETV Bharat / state

గుంటూరు జిల్లాలో సందడి లేని పరిషత్ సమరం! - గుంటూరు జిల్లాలో సందడి లేని పరిషత్ ఎన్నికలు!

గుంటూరు జిల్లాలో ప్రాదేశిక ఎన్నికల ప్రచారం చప్పగా సాగుతోంది. వైకాపా అభ్యర్థులు రోడ్ షోలు, ర్యాలీలతో ప్రచారం నిర్వహిస్తుండగా... విపక్ష అభ్యర్థులు మైక్ ప్రచారాలకే పరిమితమయ్యారు. ప్రధాన ప్రతిపక్షం తెదేపా... ఈ ఎన్నికలను బహిష్కరించిన కారణంగా.. ఫలితాలు ఏకపక్షమనే చర్చ నడుస్తోంది. భాజపా, జనసేన, వామపక్షాలు, స్వతంత్ర అభ్యర్థులు బలంగా ఉన్నచోట కొంత పోటీ ఉండే అవకాశం ఉంది. ఏది ఏమైనా... జడ్పీ పీఠంతో పాటు అన్ని ఎంపీపీలు తమవేనన్న విశ్వాసంతో అధికార పార్టీ ఉంది.

Parishad Elections in guntur
గుంటూరు జిల్లాలో సందడి లేని పరిషత్ ఎన్నికలు
author img

By

Published : Apr 5, 2021, 7:17 PM IST

రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉండే గుంటూరు జిల్లాలో ఈసారి జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సందడి అంతంతమాత్రంగా కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ ఎన్నికలను బహిష్కరించటం దీనికి ప్రధాన కారణం. అలాగే పంచాయతీ, పురపాలక ఎన్నికల ఫలితాలతో అధికార వైకాపా ఊపు మీదుంది. ప్రాదేశిక ఎన్నికల్లోనూ గెలుపు తమదేనన్న విశ్వాసంతో ఆ పార్టీ అభ్యర్థులు కూడా పెద్దగా ప్రచారాలు నిర్వహించటం లేదు. ఇక జనసేన, భాజపా, వామపక్షాల అభ్యర్థుల్లో కొందరు మాత్రమే ఇంటింటి ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ఎక్కువ మంది మైక్ ప్రచారాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. విపక్షాల నుంచి పోటీ చేసే అభ్యర్థుల వ్యక్తిగత ప్రతిష్ఠ ఆధారంగా కొన్నిచోట్ల ఫలితం ఆధారపడి ఉంది. మిగతా స్థానాల్లో అధికార పార్టీ అభ్యర్థులనే విజయం వరించే అవకాశాలున్నాయి.

గతంలో....

గత ఎన్నికల్లో జడ్పీ పాలకవర్గాన్ని తెదేపా దక్కించుకుంది. జిల్లాలో 57 జడ్పీటీసీ స్థానాలు ఉండగా 34 చోట్ల తెదేపా విజయం సాధించగా... వైకాపాకు 23 స్థానాలు దక్కాయి. 57 ఎంపీపీ పదవులకుగాను 37 చోట్ల తెదేపాకు చెందినవారు ఎంపీపీ పదవులు పొందారు. ఈసారి మంగళగిరి, తుళ్లూరు, తాడేపల్లి జడ్పీటీసీలకు ఎన్నికలు నిర్వహించటం లేదు. మరో 8 స్థానాల్లో వైకాపా అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో 46 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.

జడ్పీ పీఠం వైకాపాకు దక్కే అవకాశం!

గతంలో జిల్లా పరిషత్‌ ఛైర్మన్లుగా పని చేసిన వారు తమ పదవికి వన్నె తెచ్చారు. ఈసారి ఎస్సీ మహిళకు ఛైర్మన్ పీఠం రిజర్వ్ అయింది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా... వైకాపాకే జడ్పీ ఛైర్మన్ పీఠం దక్కే అవకాశం ఉంది. కొల్లిపర నుంచి జడ్పీటీసీగా పోటీ చేస్తున్న కత్తెర క్రిష్టినాని వైకాపా తమ ఛైర్మన్ అభ్యర్థిగా దాదాపు ఖరారు చేసింది. ఆమె తన మండలంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. వైకాపా ప్రభుత్వ సంక్షేమ పథకాలు తమని గెలిపిస్తాయని ఆమె విశ్వాసంతో ఉన్నారు. నవరత్నాలతో అన్నివర్గాల వారికి మేలు జరిగిందని... పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల ఫలితాలు పునరావృతమవుతాయని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

పల్లెల్లో కనిపించని సందడి

ఎన్నికల ప్రచారానికి ఈ నెల 6వ తేదీ సాయంత్రం వరకు గడువుంది. సమయం తక్కువగా ఉండడం, మధ్యాహ్నం వేళ ఎండలు ఎక్కువగా ఉండడంతో రోడ్ షోలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎన్నికలను ప్రధాన ప్రతిపక్షం బహిష్కరించడంతో పల్లెల్లో ఉత్సాహం కనిపించడం లేదు. ఎన్నికలు ఏకపక్షమే అన్న ధోరణితో ప్రచారం ఊపందుకోలేదు. అయితే తెదేపా ఎన్నికలను బహిష్కరించినప్పటికీ.. నామినేషన్ల ప్రక్రియ పూర్తయినందున వారు పోటీలో ఉన్నట్లే లెక్క. అభ్యర్థుల పేరు, గుర్తు బ్యాలెట్‌ పత్రాల్లో ఉంటుంది. దీనిని గుర్తించిన వైకాపా, జనసేన, భాజపా, వామపక్షాలు, స్వతంత్రులు... తెదేపా ఎటూ పోటీలో లేదు కాబట్టి తమకు ఓటేయాలని కోరుతున్నారు.

కొన్నిచోట్ల తెదేపా అభ్యర్థులు తాము పోటీలో ఉన్నామని చెబుతుండటంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. అయితే పార్టీ ముఖ్యనేతలు దీనిపై వివరణ ఇచ్చారు. ఎన్నికలు బహిష్కరించాలని రాష్ట్ర పార్టీ నిర్ణయం తీసుకుందని... స్థానికంగా ఉన్న పరిస్థితుల్ని బట్టి అభ్యర్థులో పోటీలో ఉంటారని పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు స్పష్టం చేశారు.

వైకాపా జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల తరపున స్థానిక ఎమ్మెల్యేలు ప్రచారంలో పాల్గొంటున్నారు. తమ పార్టీ అభ్యర్థుల గెలుపు ఇప్పటికే ఖరారైందని వారు చెబుతున్నారు. ప్రజలకు అవసరమైన సంక్షేమ పథకాలు ఎలాంటి అవినీతి లేకుండా నేరుగా అందుతున్నాయి కాబట్టే వారు వైకాపాకి ఓట్లేస్తారని విశ్వాసంతో ఉన్నారు. పంచాయతీ, పురపాలక ఎన్నికల్లో పార్టీ విజయాలే దీనికి నిదర్శనంగా చెబుతున్నారు.

పటిష్ట భద్రత ఏర్పాటు

ఏకగ్రీవాలు పోగా... మిగిలిన 571 ఎంపీటీసీ, 46 జడ్పీటీసీ స్థానాలకు ఈనెల 8న పోలింగ్‌ జరగనుంది. మరోవైపు పోలింగ్‌ గడువు సమీపిస్తుండటంతో ప్రలోభాలను అరికట్టేందుకు యంత్రాంగం సిద్ధమైంది. నిఘాను ముమ్మరం చేసింది. నగదు, మద్యం తదితరాలు తరలించకుండా ప్రధాన రహదారుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ప్రధాన రహదారుల్లో చెక్‌పోస్టుల ద్వారా నిఘా పెట్టారు. వీటివద్ద 24 గంటల పాటు సిబ్బంది విధుల్లో ఉండేలా చర్యలు తీసుకున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించి అక్కడ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

భాజపాను గెలిపిస్తే రాష్ట్రాభివృద్ధి ఖాయం: కన్నా లక్ష్మీనారాయణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.