ETV Bharat / state

మంచి చేశాడని పొగిడావా..? ఇక అంతే సంగతులు..

YSRCP YOUTH LEADER MEERAVALI : ఎవరైనా మంచి పని చేస్తే పొగడటం మానవ సహజం. కానీ ఇక్కడ మాత్రం అలా కాదండీ బాబు. వారిని మెచ్చకున్నావంటే మాటల్తో పొడుస్తారు.. అందేనండీ మన రాష్ట్రానికి ప్రతిపక్ష హోదాలో ఉన్న చంద్రబాబును ప్రశంసిస్తూ అధికార పక్షానికి చెందిన యువ నాయకుడు గత నెలలో సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. ఇక అంతే వైఎస్సార్సీపీ నాయకులు బెదిరింపులు షురూ చేశారు.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Mar 2, 2023, 11:02 AM IST

Updated : Mar 2, 2023, 12:40 PM IST

వైఎస్సార్సీపీలో ఉండి టీడీపీ వాళ్లను.. అయితే జాగ్రత్త అన్నా బెదిరింపులు రావచ్చు

YSRCP YOUTH LEADER MEERAVALI: గతంలో వైఎస్సార్​సీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు సొంత పార్టీ నేతలనే విమర్శించారంటూ ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురి చేశారు. ప్రస్తుతం అధికార పక్ష యువ నేత ఒకరు పార్టీకి విరుద్ధంగా వ్యవహరించి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అతను చేసిన పనేంటంటే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయడును పొగడటమే..

రాష్ట్రంలో జ‌గ‌న్ ప‌రిపాల‌న ప‌ట్ల అసంతృప్తితో ఉన్న వారు ఇప్పుడిప్పుడే ఒక్కొక్కరు బయటపడుతున్నారు. 'మూడు రాజ‌ధానుల విధానం న‌చ్చ‌ని వైఎస్సార్సీపీ కార్య‌క‌ర్త‌లు సైతం ఏకంగా చంద్ర‌బాబుకి జై కొడుతున్నారు' అని వైఎస్సార్సీపీ యువ‌జ‌న విభాగం రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి షేక్ మీరావ‌లి అన్నారు. రాజధాని విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు విజ‌న్ త‌న‌కు ఎంత‌గానో నచ్చిందన్నారు. ఇటీవ‌ల ఫ్లైట్ జ‌ర్నీ చేస్తూ చంద్ర‌బాబుతో సెల్ఫీ తీసుకోవ‌డంతో సోష‌ల్ మీడియాలో సంచ‌ల‌నంగా మారింది. ఈ ప‌రిణామాల అనంత‌రం వైఎస్సార్సీపీ నేతల నుంచి బెదిరింపులు వచ్చాయని మీరావ‌లి మీడియాతో మాట్లాడారు.

చంద్ర‌బాబు విజ‌న్ : కేవ‌లం అమ‌రావ‌తి రాజ‌ధాని, ఏపీ భవ‌ష్య‌త్ గురించి మాత్ర‌మే చంద్రబాబుతో చర్చించానని అన్నారు. అయితే ఈ విష‌యంపై స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు విమర్శలు చేయడం సరికాదన్నారు. చంద్ర‌బాబుతో భేటీ అయిన అనంత‌రం వాట్సప్ గ్రూపుల నుంచి తొలగించారని మీరావ‌లి తెలిపారు. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నార‌ని అన్నారు. అధిష్టానం ఎలాంటి నిర్ణ‌యం తీసుకున్నా స్వాగ‌తించేంద‌ుకు సిద్దంగా ఉన్న‌ానని చెప్పారు. అమ‌రావ‌తి రాజ‌ధాని విష‌యంలో చంద్ర‌బాబు విజ‌న్ త‌న‌కెంతో న‌చ్చింద‌ని, అందువ‌ల్ల‌నే జై చంద్ర‌బాబు అనేంద‌ుకు సిద్దంగా ఉన్నానని తెలిపారు. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరు మండలం ఊటుకూరుకు చెందిన మీరావలి వైఎస్సార్సీపీలో క్రియాశీల నాయకుడు.

గతంలో వైరల్ అయిన సెల్ఫీ వీడియో : గత నెల మొదటి వారంలో నారా చంద్రబాబు నాయడుతో వైఎస్సార్సీపీ యువ‌జ‌న విభాగం రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి షేక్ మీరావ‌లి సెల్ఫీ వీడియోలో చంద్రబాబును ప్రశంసిస్తూ మాట్లాడారు. అది కాస్తా వైరల్​గా మారింది. ఆ విషయం అధికార పార్టీ నాయకులకు మింగడు పడలేదు. మాటల తూటాలతో బెదింరించడం ప్రారంభించారు.

సెల్ఫీ వీడీయోలో ఏముంది? : ఇండిగో విమానంలో ప్రయాణం చేస్తున్నానని, మన రాష్ట్ర రాజధాని నిర్మాత చంద్రబాబు నాయుడు ఉన్నారనీ, ఎక్కువ మంది చెప్తారు నారా చంద్రబాబు నాయుడు చార్టర్ ప్లైట్‌లో వెళ్తారనీ, రాజధాని కోసం వెచ్చించిన ఆదాయాన్ని ఖర్చు చేస్తారని.. అది తప్పు అని వైఎస్సార్​సీపీ నేత మీరావళి అన్నారు. తాను వైఎస్సార్​సీపీకి చెందిన వాడనినని, తన పేరు మీరావళి అని పరిచయం చేసుకుంటే.. రాష్ట్ర అభివృద్ది, భవిష్యత్తు ముఖ్యమని చంద్రబాబు నాయడు అన్నారని మీరావళి పేర్కొన్నారు. రాజకీయాలు పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్​కి సీఎంగా చంద్రబాబు అని, బాబు కలవడం ఆనందంగా ఉందని ఎస్సార్సీపీ యువ‌జ‌న విభాగం రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి షేక్ మీరావ‌లి అన్నారు.

ఇవీ చదవండి

Last Updated : Mar 2, 2023, 12:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.