రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు సముచిత స్తానం కల్పిస్తూ.. 56 బీసీ కార్పొరేషన్లకు ఛైర్మన్లను, 672 మంది డైరెక్టర్లను ప్రకటించిన సందర్భంగా గుంటూరులో వైకాపా నేతలు బైక్ ర్యాలీ నిర్వహించారు. గుంటూరు స్వామి థియేటర్ నుంచి గుజ్జనగుండ్ల కూడలి, రింగ్ రోడ్డు, విద్యానగర్, కొరిటిపాడు మీదుగా బైక్ ర్యాలీ చేపట్టారు. అనంతరం నగరంపాలెం వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మద్దాలి గిరిధర్, మహమ్మద్ ముస్తఫా, మిర్చియార్డు ఛైర్మన్ చంద్రగిరి ఏసురత్నం, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, పలువురు వైకాపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఇదీ చదవండి: ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా ఉత్సవాలు...అన్నపూర్ణాదేవిగా అమ్మవారి దర్శనం