పేదల కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు తెలుసుకుని సాయం చేయాలనే మంచి మనసు, తలంపు ఉన్న సీఎం దేశంలో ఒక్క వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మాత్రమేనని చిలకలూరిపేట శాసనసభ్యురాలు విడదల రజిని అన్నారు. వైఎస్సార్ వాహన మిత్ర పథకంలో భాగంగా ఆటో, క్యాబ్, కార్లు నడుపుకుని జీవించే డ్రైవర్లకు రెండో విడత ఆర్థిక సాయాన్ని ఆమె అందించారు. ఈ సందర్భంగా ఆమె కూడా డ్రైవర్ల చొక్కా ధరించి స్థానిక మార్కెట్ యార్డులో ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కారణంగా డ్రైవర్లంతా ఉపాధి కోల్పోయారని... వారు పస్తులుండాల్సిన దుస్థితి నెలకొన్న విషయాన్ని సీఎం గుర్తించారని చెప్పారు. అందుకే నాలుగు నెలల ముందుగానే డ్రైవర్లకు ఒక్కొకరికి రూ.10వేలు చొప్పున ఆర్థిక సాయం అందజేశారని తెలిపారు. ఈ నగదుతో వాహనాల ఫిట్‌నెస్, బీమా, మరమ్మతులు లాంటివి చేసుకోవచ్చని తెలిపారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో 1200 మంది డ్రైవర్లకు ఆర్థిక సాయం అందుతున్నట్లు... గురువారం ఒక్క రోజే రూ.1.2 కోట్ల ఆర్థిక సాయం ఒక్క చిలకలూరిపేట నియోజకవర్గంలోని డ్రైవర్లకే అందుతోందని ఆమె అన్నారు.
వైఎస్సార్ వాహనమిత్ర ఆర్థిక సాయాన్ని అందజేసిన ఎమ్మెల్యే - ysr vahanamitra programme at guntur district
చిలకలూరిపేట నియోజకవర్గంలో వైఎస్సార్ వాహన మిత్ర పథకంలో భాగంగా ఆటో, క్యాబ్, కార్లు నడుపుకుని జీవించే డ్రైవర్లకు రెండో విడత ఆర్థిక సాయాన్ని ఎమ్మెల్యే రజిని అందజేశారు.
పేదల కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు తెలుసుకుని సాయం చేయాలనే మంచి మనసు, తలంపు ఉన్న సీఎం దేశంలో ఒక్క వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మాత్రమేనని చిలకలూరిపేట శాసనసభ్యురాలు విడదల రజిని అన్నారు. వైఎస్సార్ వాహన మిత్ర పథకంలో భాగంగా ఆటో, క్యాబ్, కార్లు నడుపుకుని జీవించే డ్రైవర్లకు రెండో విడత ఆర్థిక సాయాన్ని ఆమె అందించారు. ఈ సందర్భంగా ఆమె కూడా డ్రైవర్ల చొక్కా ధరించి స్థానిక మార్కెట్ యార్డులో ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కారణంగా డ్రైవర్లంతా ఉపాధి కోల్పోయారని... వారు పస్తులుండాల్సిన దుస్థితి నెలకొన్న విషయాన్ని సీఎం గుర్తించారని చెప్పారు. అందుకే నాలుగు నెలల ముందుగానే డ్రైవర్లకు ఒక్కొకరికి రూ.10వేలు చొప్పున ఆర్థిక సాయం అందజేశారని తెలిపారు. ఈ నగదుతో వాహనాల ఫిట్‌నెస్, బీమా, మరమ్మతులు లాంటివి చేసుకోవచ్చని తెలిపారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో 1200 మంది డ్రైవర్లకు ఆర్థిక సాయం అందుతున్నట్లు... గురువారం ఒక్క రోజే రూ.1.2 కోట్ల ఆర్థిక సాయం ఒక్క చిలకలూరిపేట నియోజకవర్గంలోని డ్రైవర్లకే అందుతోందని ఆమె అన్నారు.
ఇదీ చదవండి: కలుషిత ఆహారం తిని 23 మందికి అస్వస్థత