ETV Bharat / state

అధికారులు మరిచారు.. కానీ ఆ యువకుడు బాధ్యత చూపాడు! - గుంటూరు జిల్లా కొమ్మూరు వద్ద రోడ్డుపై యువకుడు ఆదర్శం తాజా వార్తలు

అక్కడ మూడు నెలల క్రితం పడిన గుంతకు అధికారులు మరమ్మతులు చేయలేదు. అసలు పట్టించుకున్న వారే లేరు. వాహనాలు వస్తున్నాయి పోతున్నాయి. గుంతలో నీరు చేరి.. ఇబ్బందులు కలుగుతూనే ఉన్నాయి.

అధికారులు మరిచారు.. కానీ ఆ యువకుడు బాధ్యత చూపాడు!

author img

By

Published : Nov 15, 2020, 7:43 PM IST

గుంటూరు జిల్లా కాకుమాను మండలం కొమ్మూరు వద్ద పెదనందిపాడు బాపట్ల ప్రధాన రహదారిలో మూడు నెలల క్రితం భారీ గుంత పడింది. క్రమేపీ గుంత పెద్దదిగా మారింది. ఆదివారం వర్షం కురవడంతో ఆ గుంతలో నీరు చేరింది. గుంత ఉన్న విషయం తెలియక వాహనదారులు నేరుగా వెళ్లి ప్రమాదానికి గురి అవుతున్నారు. ఓ యువకుడు తనకెందుకులే అనుకుని వెళ్లలేదు. తన వంతు బాధ్యతగా వ్యవహరించాడు. గుంత వద్ద నీరు చేరడంతో వర్షంలో తడుస్తూనే వాహనాలను పక్కకు పంపించాడు.

ప్రమాదం జరగకుండా ఆ యువకుడు తన బాధ్యతగా వ్యవహరించాడు. అయితే ఆర్​అండ్​బీ అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. గుంత పడి నెలలు గడుస్తున్నా.. కనీసం పటిష్ట మరమ్మతులు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ రహదారిలో ఇలాంటి గుంతలు 5 నుంచి 6 వరకు ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు.

ఇదీ చదవండి: తగ్గిన పసిడి దిగుమతులు- దిగొచ్చిన వాణిజ్య లోటు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.