ETV Bharat / state

మలద్వారం వద్ద బ్లోయర్ పెట్టాడు.. ప్రాణాన్ని బలి తీసుకున్నాడు! - మల ద్వారం వద్ద బ్లోయర్​తో ప్రాణం తీశాడు వార్తలు

సరదాగా చేసిన ఓ పని తోటి కార్మికుడి ప్రాణం తీసింది. పక్క రాష్ట్రం నుంచి బతుకు తెరువు కోసం వచ్చిన ఆ యువకుడికి.. మరణం బ్లోయర్ రూపంలో ఎదురొచ్చింది. తోటి కార్మికుడు ఆకతాయితనంతో చేసిన పని.. విషాదానికి కారణమైంది.

మలద్వారం వద్ద బ్లోయర్ పెట్టాడు.. ప్రాణాన్ని బలి తీసుకున్నాడు!

author img

By

Published : Oct 10, 2020, 11:52 PM IST

గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం బోయ పాలెం వద్ద అనంతలక్ష్మి నూలు మిల్లు ఉంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్ జిల్లా అల్లాపూర్ కు చెందిన వలస కార్మికుడు విశాల్ కుమార్(18) కొంత కాలంగా పని చేశాడు. ఇక్కడ పని చేసిన వారు రోజూ బ్లోయర్ ద్వారా ఒంటికి పట్టిన దుమ్మును వదిలించుకుంటారు. శుక్రవారం రాత్రి విధులు ముగిసిన తరువాత విశాల్ అలా చేస్తుండగా తోటి కార్మికుడు వచ్చాడు.

బ్లోయర్ యంత్రాన్ని విశాల్ కుమార్ మలద్వారం వద్ద ఉంచి ఆన్ చేశాడు. ఒక్కసారిగా గాలి పొట్ట లోకి వెళ్లింది. ఈ ఘటనతో విశాల్ కుమార్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే నూలు మిల్లు యాజమాన్యం అతడిని గుంటూరు జీజీహెచ్​కి తరలించగా... చికిత్స పొందుతూ.. పరిస్థితి విషమించి.. విశాల్ మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు యడ్లపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

విద్యుదాఘాతంతో ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.