మద్యానికి బానిసైన ఓ యువకుడు శానిటైజర్ తాగి మృతి చెందిన సంఘటన గుంటూరులో జరిగింది. జిల్లాలోని బాలాజీ నగర్‌కు చెందిన మహేశ్ అనే యువకుడు కొన్నాళ్లుగా మద్యానికి బానిసయ్యాడు. మద్యం దొరకకపోవటంతో ఐదు శానిటైజర్ డబ్బాలను కొనుగోలు చేసి సేవించాడు. శానిటైజర్ సేవించిన అతడిని తీవ్ర అస్వస్థతకు గురవ్వటంతో కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మహేష్ మృతి చెందాడు.
ఇదీ చదవండి: