గుంటూరు జిల్లా జొన్నలగడ్డలో సుబాబుల్ తోటను నరసారావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అనుచరులతో ధ్వంసం చేయించారంటూ వైకాపా మాజీ అధ్యక్షుడు కొమ్మరబోయిన శంకర్ యాదవ్ ముఖ్యమంత్రికి తప్పుడు సెల్ఫీ వీడియో పెట్టాడంటూ వైకాపా కార్యకర్తలు ఆరోపించారు.
సుబాబుల్ భూమిని 15 లక్షలకు 2015లో తను కొనుగోలు చేశానంటూ వైకాపాకు చెందిన ఓబుల్ రెడ్డి అనే కార్యకర్త తెలిపారు. అయితే ఆ భూమి తనదేనంటూ పలువురు కార్యకర్తలు వద్ద శంకర్ యాదవ్ అప్పులు చేస్తున్నారంటూ ఆరోపించారు.
తనకు అమ్మిన భూమిలో సుబాబుల్ వేసుకుని వాటిని నేను అమ్ముకుంటే తన భూమిలో సుబాబుల్ ధ్వంసం చేశారంటూ శంకర్ యాదవ్ అసభ్యంగా వీడియోలు పెట్టి పార్టీ పరువు తీస్తున్నారంటూ వైకాపా కార్యకర్త ఓబుల్ రెడ్డి పేర్కొన్నారు.
ఇదీ చూడండి