గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తీరును నిరసిస్తూ తాడేపల్లి మండలం పెనుమాకలో మహిళలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. దాదాపు 30 డ్వాక్రా సంఘాలకు లోన్ లు రాకుండా ఎమ్మెల్యే అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
అధికారులు సైతం తెలుగుదేశం పార్టీ వాళ్లకు లోన్ లు ఇవ్వడం లేదని.. ఎమ్మెల్యే చెప్పిన వాళ్లకు మాత్రమే లోన్ ఇస్తున్నారని మహిళలు తెలిపారు. ఎమ్మెల్యే చిత్ర పటానికి పసుపు, కుంకుమ పెట్టి నిరసన తెలిపారు. ఆయన్ను తమ గ్రూప్ సభ్యులుగా చేర్చుకుంటున్నామని.. ఇపుడైనా లోన్ ఇవ్వాలంటూ పెనుమాకలోని చైతన్య గ్రామీణ బ్యాంక్ వద్ద ధర్నా చేశారు. గత 20ఏళ్లుగా ఎలాంటి ఆటంకాలు లేకుండా లోన్ లు వస్తున్నాయని... ఇపుడు ఆన్లైన్ అవ్వలేదనే కారణంతో డబ్బులు ఇవ్వడం లేదని చెప్పారు.