Women Associations protest: గుంటూరు జిల్లా కాకుమాను మండలంలో ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వారం రోజుల క్రితం బాలికపై నిందితుడు దావీదు అత్యాచారం చేశాడు. బాలికకు అనారోగ్య సమస్య తలెత్తడంతో తల్లిదండ్రులు ఆస్పత్రిలో పరీక్షలు చేయించారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు రాత్రి కాకుమాను పోలీస్స్టేషన్లో పిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
నిందితుడిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని స్టేషన్ వద్ద మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి. బాధితులకు న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటామని ఎస్సై రవీంద్రబాబు మహిళ సంఘాలకు హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి;