Women Commission Notices to Pawan kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు మహిళా కమిషన్ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ నోటీసులు జారీ చేశారు. మూడు పెళ్లిళ్ల వ్యాఖ్యలను తక్షణం వెనక్కు తీసుకోవాలని నోటీసుల్లో పేర్కొన్నారు. భరణం ఇస్తే భార్యను వదిలించుకోవచ్చనే సందేశం ఇచ్చేలా పవన్ మాటలున్నాయని పద్మ అభిప్రాయపడ్డారు. ఈ మాటలు మహిళా లోకాన్ని నివ్వెరపోయేలా చేశాయన్నారు. ఎవరి జీవితంలో అయినా మూడు పెళ్లిళ్లు చేసుకోవాల్సి రావటం వ్యతిరేక అంశమన్న పద్మ.. 'చేతనైతే మీరు మూడు పెళ్లిళ్లు చేసుకోండని' అంత సులువుగా ఎలా మాట్లాడారని ప్రశ్నించారు.
సినిమా హీరోగా, పార్టీ అధ్యక్షుడిగా పవన్ చేసిన వ్యాఖ్యలు సమాజంపై ప్రభావం చూపిస్తాయని వాసిరెడ్డి పద్మ అన్నారు. అలాగే మహిళలను ఉద్దేశించి స్టెప్నీ అనే పదం వాడటం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. పవన్ మాటలు మహిళా భద్రతకు పెనుప్రమాదంగా మారతాయన్నారు. అందుకే మహిళా లోకానికి పవన్ క్షమాపణ చెప్పాలని వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేశారు.
"మూడు పెళ్లిళ్ల వ్యాఖ్యలను తక్షణం వెనక్కి తీసుకోవాలి. మహిళా లోకానికి పవన్ క్షమాపణ చెప్పాలి. భరణమిస్తే భార్యను వదిలించుకోవచ్చనే సందేశమిచ్చేలా పవన్ మాటలున్నాయి. మహిళలను ఉద్దేశించి స్టెప్నీ అనే పదం వాడడం ఆక్షేపణీయం. పవన్ మాటలు మహిళా భద్రతకు పెనుప్రమాదంగా మారతాయి." -వాసిరెడ్డి పద్మ
ఇవీ చదవండి: