విద్యుదాఘాతానికి(current shock) గురైన భార్యను కాపాడబోయి ఆమెతోపాటు తానూ మృత్యువాతపడ్డాడో భర్త.(wife and husband died) ఈ విషాద ఘటన గుంటూరు జిల్లా(guntur district) ప్రత్తిపాడులో సోమవారం జరిగింది.
స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. ప్రత్తిపాడుకు చెందిన బట్టినేని సత్యనారాయణ (78), జయలక్ష్మి (70)కి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. దంపతులిద్దరూ పెద్ద కొడుకు తిరుపతయ్యతో కలిసి రేకుల షెడ్డులో ఉంటూ, పొలం కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నారు. సోమవారం సాయంత్రం వేళ జయలక్ష్మి తడిచిన వస్త్రాలను ఇంటి లోపల కట్టిన ఇనుప తీగపై ఆరేస్తుండగా, ఫ్యానుకు లాగిన కరెంటు తీగ నుంచి విద్యుత్తు సరఫరా జరిగింది.
దీంతో.. ఆమె విలవిలలాడుతూ కిందపడిపోయారు. గమనించిన సత్యనారాయణ.. ఆదుర్దాగా వచ్చి భార్యను పట్టుకున్నారు. ఫలితంగా.. ఇద్దరూ విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే చనిపోయారు. అప్పుడే బయటి నుంచి వచ్చిన కుమారుడు తిరుపతయ్య.. పరిగెత్తుకొచ్చి కిందపడి ఉన్న తల్లిదండ్రులను లేపేందుకు ప్రయత్నించగా అతనికీ షాక్ తగిలింది. ఆయన తృటిలో తప్పించుకున్నారు. వెంటనే విద్యుత్ మెయిన్ ఆపేసి చూడగా.. అప్పటికే తల్లిదండ్రులు మృతిచెందారు.
ఇదీ చదవండి