గుంటూరు మిర్చి యార్డులో తాగునీటి సౌకర్యం సరిగా లేక రైతులు, కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. వేలాది మంది ఉండే మార్కెట్లో మంచినీరు అందించే పరిస్థితి లేకపోవటంపై కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో యార్డులోని 8 చోట్ల మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. అయితే సరైన నిర్వహణ లేని కారణంగా అవి పాడైపోయాయి. చాలావరకు తాళాలు వేసి కనిపిస్తున్నాయి.
ప్రస్తుతం మార్కెట్ మొత్తం కలిపి రెండు చోట్ల మాత్రమే మున్సిపల్ వాటర్ వస్తోంది. అంత పెద్ద మార్కెట్లో అందరూ అక్కడకు వెళ్లి నీళ్లు తాగలేని పరిస్థితి. దీంతో తమ ఇంటి నుంచే మంచినీరు సీసాల్లో తెచ్చుకుంటున్నట్లు హమాలీలు చెబుతున్నారు. మార్కెట్ యార్డుకు కోట్ల రూపాయల ఆదాయం ఉన్నా.. అధికారులు కనీస సౌకర్యాలు కల్పించకపోవటంపై వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: వలసకూలీల అంశంపై సుప్రీం కీలకతీర్పు