ETV Bharat / state

'తెదేపా ఏజెంట్లను ఎందుకు అడ్డుకుంటున్నారు?' - నరసరావు పేట ఎంపీటీసీ జడ్పీటీసీ తాజా వార్తలు

గుంటూరు జిల్లా నరసరావుపేటలో సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని గోనెపూడి, పాలపాడు గ్రామస్తులు ముట్టడించారు. ఆయా గ్రామాల్లో జరుగుతున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలకు తెలుగుదేశం పోలింగ్ ఏజెంట్లను లోపలికి వెళ్లకుండా వైకాపా నేతలు అడ్డుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

'తెదేపా ఏజెంట్లను అడ్డుకున్నారని సబ్ కలెక్టర్ ఆఫీస్ ముట్టడి'

author img

By

Published : Apr 8, 2021, 4:19 PM IST

గోనెపూడి, పాలపాడు గ్రామాల్లో జరుగుతున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ కేంద్రాల్లోకి.. తెదేపా పోలింగ్ ఏజెంట్లు వెళ్లకుండా వైకాపా నేతలు అడ్డుకున్నారని స్థానికులు నిరసన వ్యక్తం చేశారు. తెదేపా ఏజెంట్ల చేతిలో ఉన్న ఫారాలను చింపేసి.. ఆపై దాడి చేశారని ఆగ్రహించారు.

'రిగ్గింగ్​కు పాల్పడ్డారు'

పోలింగ్ కేంద్రాల్లో ఉన్న తెదేపా ఏజెంట్లను బయటకు పంపించేసి వైకాపా నేతలు రిగ్గింగ్​కు పాల్పడ్డట్లు గ్రామస్థులు పేర్కొన్నారు. ఎన్నికల పోలింగ్ కేంద్రాల వద్ద అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చూడాల్సిన పోలీసులే... అధికార పార్టీ శ్రేణుల్ని అడ్డుకోకుండా తిరిగి తమపైనే జులుం చూపించడమేమిటని పాలపాడు తెదేపా నేత పులిమి రామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

'సీఐను సస్పెండ్ చేయాలి'

తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలపై వివక్ష చూపించి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ.. నరసరావుపేట రెండో పట్టణ సీఐ కృష్ణయ్యను వెంటనే సస్పెండ్ చేయాలంటూ పార్టీ నాయకులతో పాటు.. స్థానికులు డిమాండ్ చేశారు.

'అప్పటివరకు ఇక్కడే బైఠాయిస్తాం'

ఆయా గ్రామాల్లో రీపోలింగ్ సైతం జరిగేలా చూడాలని సబ్ కలెక్టర్​కు వినతిపత్రం అందజేయనున్నట్లు వివరించారు. తమ డిమాండ్ కు స్పందించేవరకు వరకు సబ్ కలెక్టర్ కార్యాలయంలోనే బైఠాయిస్తామని భీష్మించారు. కార్యక్రమంలో పాలపాడు తెదేపా నాయకులు పులిమి రామిరెడ్డి, పాలపాడు ఎంపీటీసీ అభ్యర్థి పులిమి ప్రతిభా భారతి, గోనెపూడి ఎంపీటీసీ అభ్యర్థి కంటూ శ్రీదేవి, ఇరు గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.

ఇవీ చూడండి:

భార్యపై పెట్రోల్‌ పోసి హత్య చేసిన కేసులో భర్తకు ఉరిశిక్ష

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.