ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరించాలని.. గుంటూరు జిల్లా తాడేపల్లిలో బాధితులు నిరసన దీక్షలు చేపట్టారు. తాడేపల్లి సలాం సెంటర్ రైల్వే స్థలాల్లో సుమారు 650 కుటుంబాలు తాత్కాలిక నివాసం ఏర్పాటు చేసుకున్నారు. 90ఏళ్లకు పైగా ఉంటున్న వారిని.. అక్కడి నుంచి ఖాళీ చేయాలంటూ రైల్వే అధికారులు నోటీసులు జారీ చేశారు. దీనిపై బాధితులు ఆందోళనకు దిగారు. సీఎం జగన్, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీక్ష చేస్తున్న వారికి.. జనసేన నాయకులు సంఘీభావం తెలిపారు.
తమ ఇళ్లు తొలగించబోమని గతంలో చెప్పిన ఎమ్మెల్యే.. ఇప్పుడెక్కడ ఉన్నారని బాధితులు ప్రశ్నించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:
YCP LEADERS PROTEST : 'వంద శాతం ఫలితాలు తీసుకురాలేని ఉపాధ్యాయులు వద్దు'