Venkaiah Naidu Participated in Dr.Kasaraneni Sadasiva Rao Centenary Celebrations: ప్రజా వైద్యునిగా, కళా ప్రియునిగా ప్రముఖ వైద్యులు డాక్టర్ కాసరనేని సదాశివరావు ఎనలేని సేవ చేశారని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. గుంటూరులో జరిగిన కాసరనేని సదాశివరావు శత జయంతి ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సదాశివరావు జీవిత విశేషాలపై రూపొందించిన ప్రత్యేక సంచిక సదాస్మరామి పుస్తకాన్ని, ప్రత్యేక తపాలా బిళ్లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ డాక్టర్ కాసరనేని సదాశివరావు వైద్య, కళా, రాజకీయ రంగాలకు చేసిన సేవల్ని కొనియాడారు.
ఒక సాధారణ కుటుంబంలో పుట్టి ఉన్నత స్థాయికి ఎదిగిన ఆయన జీవితం అందరికీ స్ఫూర్తి అన్నారు. ప్రజా వైద్యుడిగా జనం గుండెలను గెలుచుకున్నారని, లక్షల మంది గుండెల్లో సదాశివరావు నిలిచిపోయారని, పరోపకారం కోసం జీవితాంతం కట్టుబడిన వ్యక్తి సదాశివరావు అని తెలిపారు. జీవితంలో సేవ అనేది ఒకభాగం కావాలని అన్నారు. రైతుల హక్కుల కోసం, ఎన్టీఆర్ పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చి పెదకూరపాడు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారని.. శాసనసభలో హుందాగా ఉండేవారని గుర్తు చేసుకున్నారు. అరుదైన రాజకీయ నాయకుల్లో కాసరనేని ఒకరని కొనియాడారు.
Kodela Awards: చట్టసభల్లో హుందాగా వ్యవహరించడమే కోడెలకు ఇచ్చే నివాళి: వెంకయ్య నాయుడు
Venkaiah Naidu Comments on Political Leaders : నీతి, నిజాయతీ, చిత్తశుద్ధితో పనిచేసేవారు రాజకీయాల్లో ఉంటే దేశం బాగుపడుతుందని వెంకయ్యనాయుడు అన్నారు. అయితే అందుకు భిన్నంగా ప్రస్తుత రాజకీయాలున్నాయని ఆవేదన వెలిబుచ్చారు. ప్రస్తుతం రాజకీయాల్ని చూస్తుంటే జుగుప్స కలుగుతోందని అన్నారు. కొందరు నాయకులను చూసి సిగ్గు పడాల్సి వస్తోందని అసహనం వ్యక్తం చేశారు. నాయకులకు కులం, మతం, నేర మనస్తత్వం, డబ్బు ఎక్కువ కావటం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని, చట్ట సభల్లో వ్యక్తిగత దూషణలకు అవకాశం ఉండరాదని స్పష్టం చేశారు. నాయకులు తమ స్థాయికి తగ్గట్లుగా మాట్లాడటం లేదని.. తప్పుడు భాష మాట్లాడేవారిని ఎన్నిక్లలో ఓడించటమే సరైన మందని అన్నారు. మంచి వ్యక్తులను మనం ఎన్నుకోవాలని.. గుణవంతులను గెలిపిస్తే ప్రజలకు మంచి జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
Venkaiah Naidu Aathmeeya Samavesham: సొంత డబ్బు ఖర్చు పెట్టి ప్రజలే గెలిపించారు.. : వెంకయ్యనాయుడు
ప్రజలు ఆలోచించి మంచి వ్యక్తులను గెలిపించుకోవాలి.. రాజకీయాల్లోకి చదువుకున్నవారు రావాలి.. సేవాభావం ఉన్నవారు వైద్య వృత్తిలో ఉండాలని.. కొందరు అనవసరంగా లేనిపోని వైద్య పరీక్షలు రాసి రోగి జేబులు ఖాళీ చేస్తున్నారు. పేద రోగుల వద్ద డబ్బులు తీసుకోకుండా సదాశివరావు వైద్యం అందించారు. నాగార్జున ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా విద్యా సంస్థలను స్థాపించారు. -వెంకయ్యనాయుడు, మాజీ ఉప రాష్ట్రపతి
ఈ కార్యక్రమానికి మాజీ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు, మాజీ మంత్రులు వడ్డే శోభానాదీశ్వరావు, కామినేని శ్రీనివాసరావు, హాజరయ్యారు.