ETV Bharat / state

ఫుడ్ గ్యారేజ్.. ఇచ్చట అన్నీ రకాల రుచులు లభించును

author img

By

Published : Jan 16, 2023, 9:36 AM IST

Food Garage Trending Restaurant : రోడ్డు మీద ఉండాల్సిన వాహనం హోటల్లో ఉంటుందా? రేసింగ్ ట్రాక్​పై కనపించే కారు రెస్టారెంట్లోకి వస్తుందా? వినటానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. వినియోగదారుల్ని ఆకట్టుకునే క్రమంలో గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఓ హోటల్ నిర్వాహకులు వాహనాలతో రెస్టారెంట్​ను తీర్చిదిద్దారు. ఇక్కడకు వస్తున్న వారు కొత్తరకం పరిసరాల్ని మెచ్చుకుంటూ.. ఆహారపు రుచులను ఆస్వాదిస్తున్నారు.

Food Garage
Food Garage
ఫుడ్ గ్యారేజ్.. ఇచ్చట అన్నీ రకాల రుచులు లభించును

Food Garage Trending Restaurant: ఏ రంగంలో రాణించాలన్నా కాస్త విభిన్నంగా ఆలోచించాలి. వ్యాపార రంగంలో ప్రస్తుత పోటీని తట్టుకుని నిలవాలంటే.. మరింత వైవిధ్య భరితంగా ఆలోచించక తప్పదు. ఇదే సూత్రాన్ని ఆచరిస్తూ ఓ వ్యక్తి ముందుకు సాగుతున్నారు. దశాబ్దాలుగా ఎంతో అనుబంధం ఉన్న మోటార్ వాహనాల థీమ్‌తో హోటల్ రంగంలోకి అడుగుపెట్టారు. విభిన్నమైన వాహనాల ఇంటీరియర్‌తో ఆకట్టుకునేలా రెస్టారెంట్‌ను తీర్చిదిద్దారు. వినియోగదారులు చూడముచ్చటైన వాతావరణంలో కూర్చుని భోజనాన్ని ఆస్వాదించేలా ఏర్పాట్లు చేశారు.

ఆకట్టుకునేలా రెస్టారెంట్‌: ఇక్కడి వాతావరణం చూసి ఏ కారో, లారీనో లేక ట్రాక్టర్ గ్యారేజీ అనుకుంటే పొరబాటే. చుట్టూ వాహనాల టైర్లు.. గోడలపై బైక్‌లు, సైకిళ్ల బొమ్మలు... వీటిని చూసి షోరోమ్ అని ఫిక్స్ అయితే పొరబడినట్లే. ఎందుకంటే ఇది ఓ రెస్టారెంట్. అందమైన రంగులతో చూడగానే ఆకట్టుకునే ఇంటీరియర్ డిజైనింగ్..! వీటన్నిటిని చూస్తూ.... నచ్చిన భోజనాన్ని ఆస్వాదిస్తే ఆ మజానే వేరు. భోజనప్రియులకు అలాంటి అనుభూతినే పంచుతోంది గుంటూరు జిల్లా మంగళగిరిలోని గుఫూ రెస్టారెంట్.

తీవ్ర పోటీ.. వినూత్న ఆలోచన: విజయవాడకు చెందిన కృష్ణ ప్రసాద్ కుటుంబానిది లారీల వ్యాపారం. ప్రస్తుతం మోటారు వాహనాల రంగం తీవ్ర సంక్షోభంలో ఉంది. దీంతో హోటల్ రంగంలోకి రావాలనుకున్నారు. ఇప్పటికే గల్లీకో హోటల్ ఉండటంతో ఈ వ్యాపారంలో తీవ్ర పోటీ నెలకొంది. ఏదైనా వినూత్నంగా జనాలను ఆకర్షించేలా ఉండాలనుకున్నారు. దశాబ్దాలుగా అనుబంధం ఉన్న మోటార్ వాహనాల థీమ్‌తో రెస్టారెంట్ ఏర్పాటు చేశారు. రెస్టారెంట్ ముందు భాగాన్ని లారీ క్యాబిన్‌తో తీర్చిదిద్దారు. వివిధ రకాల వాహనాల ఇంటీరియర్‌ను అమర్చారు. వాహనాల ఆకృతిలో డైనింగ్ టేబుల్స్, పెట్రోల్ పంప్ తరహాలో బీరువా, సైకిల్ మీద హ్యాండ్ వాష్, ప్రత్యేక డిజైన్లలో కుర్చీలు ఇలా వేటికవే ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి.

గుఫూ ఓ ఫిక్షనల్ క్యారెక్టర్: రెస్టారెంట్‌కి పెట్టిన పేరు వెనుక కూడా పెద్ద కథే ఉంది. గుఫూ అనేది ఓ ఫిక్షనల్ క్యారెక్టర్. గుఫూ తండ్రి పంజాబీ, తల్లి ఆంధ్రా కావటంతో ఈ రెండు రకాల వంటకాలను అందుబాటులో ఉంచారు. పంజాబీ దాబా తరహా వాతావరణాన్ని కల్పిస్తున్నారు. వెయిటర్స్ కూడా ఆత్మీయంగా పలకరిస్తూ ప్రత్యేకమైన లంచ్ బాక్స్‌లో వంటకాలు తెచ్చి కొసరికొసరి వడ్డిస్తుంటారు.

మా నాన్నా కాలం నుంచి మోటర్ ఫీల్డ్. ఆ వృత్తి పోగోట్టుకోవడం ఇష్టం లేక వాహనాలను ఉపయోగించుకోని హోటల్ లోకి వచ్చాము. మోటార్ ఫీల్డ్ బాగోక ఈ రంగాన్ని ఎంచుకున్నాం. మా కొడుకు కుడా సహాయం చేస్తాడు. -కృష్ణప్రసాద్, గుఫూ హోటల్ నిర్వాహకులు

ఈ రెస్టారెంట్ పేరు వెనక కూడా ఓ కథ ఉంది. ప్రత్యేకమైన లంచ్ బాక్స్​లో వంటకాలు తెచ్చి వినియోగదారులకు వడ్డిస్తాం. ఇక్కడి వంటకాల్లో హానికర రంగులు, రసాయనాలు వాడకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. -విజయ్ కుమార్, గుఫూ హోటల్ నిర్వాహకులు

సెల్ఫీ స్పాట్: ఇలాంటి హంగులతో చుట్టుపక్కల హోటళ్లు లేకపోవడంతో చిన్నాపెద్దా అందరూ ఆకర్షితులవుతున్నారు. రెస్టారెంట్‌లోనీ అణువణువూ చూడముచ్చటగా ఉండటంతో సెల్ఫీ స్పాట్ గా మారిపోయింది. కుటుంబసభ్యులు, మిత్రులతో కలిసి వచ్చి ఆహారంతోపాటు పరిసరాలనూ ఆస్వాదిస్తూ మధురానుభూతిని పొందుతున్నారు.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.