FIRE TO BORUGADDA ANIL OFFICE : బోరుగడ్డ అనిల్ కార్యాలయాన్ని దుండగులు తగులబెట్టారు. సోమవారం అర్ధరాత్రి దాటాక గుంటూరులోని డొంకరోడ్డులో ఉన్న ఆయన క్యాంపు కార్యాలయంపై పెట్రోలు చల్లి నిప్పంటించారు. మంటల్లో అక్కడి ఫర్నీచర్ పూర్తిగా కాలిపోయింది. ఇటీవల నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని ఫోన్‌లో అనిల్ బెదిరించిన విషయం తెలిసిందే. సీఎం జగన్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడితే రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్తానని ఆయన వ్యాఖ్యానించారు.
తన కార్యాలయాన్ని తగులబెట్టిన ఘటనపై బోరుగడ్డ అనిల్ ఓ వీడియోను విడుదల చేశారు. ఇది ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పనేనని ఆయన ఆరోపించారు. కోటంరెడ్డికి గుంటూరు జిల్లా టీడీపీ నేతలు కొందరు సహకరించినట్లు పేర్కొన్నారు.
ఇవీ చదవండి: