గుంటూరు నగరంలో అనధికారికంగా కొవిడ్ పేషెంట్లకు చికిత్స అందిస్తున్న ఆసుపత్రిని రెవెన్యూ, పోలీసు అధికారులు పరిశీలించి సీజ్ చేశారు. కొత్తపేట పరిధిలోని గుంటూరువారితోట 7వలేనులో ఓ ఆసుపత్రిలో కొవిడ్ పేషెంట్లకు చికిత్స అందిస్తున్నారు. స్థానిక ప్రజల నుంచి సమాచారం అందుకున్న తహశీల్దార్ శ్రీకాంత్, కొత్తపేట సీఐ రాజశేఖర్‌రెడ్డిలు ఆసుపత్రిలో తనిఖీ చేపట్టగా.. ముగ్గురు కొవిడ్ పేషెంట్లు చికిత్స పొందుతున్నట్లుగా గుర్తించారు. అందులో ఒకరు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. అనధికారికంగా కరోనా చికిత్స నిర్వహిస్తున్నందున ఆసుపత్రిలోని పేషెంట్లను కొవిడ్ ఆసుపత్రికి తరలించి, ఆసుపత్రిని సీజ్ చేసినట్లు తహశీల్దార్ తెలిపారు. దీనిపై జిల్లా కలెక్టర్‌కు నివేదిక సమర్పించనున్నట్లు వివరించారు.
ఇదీ చదవండి: అద్దె ఇంట్లో 2 సార్లు దొంగతనం.. విచారణలో తేలిన మరో నిజం!