ప్రమాదవశాత్తు ద్విచక్రవాహనం డివైడర్ను ఢీకొన్న ఘటన గుంటూరు జిల్లా నరసరావుపేటలో జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడిక్కడే మృతి చెందారు. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం గాయపడ్డ యువకుడిని చికిత్స నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించగా.. పరిస్థితి విషమించటంతో.. మరో ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి సైతం విషమంగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. స్నేహితుడి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని తిరిగి వస్తుండగా.. ప్రమాదం జరిగిందని నరసరావుపేట రెండో పట్టణ ఎస్సై రబ్బానీ తెలిపారు.
ఇవీ చూడండి..
కరోనాతో మాజీ సైనికుడు మృతి... మృతదేహం తీసుకొస్తూ మరో వ్యక్తి మరణం