ETV Bharat / state

పాండురంగాపురం బీచ్​లో ఇద్దరు యువకులు గల్లంతు - guntur district latest news

ప్రకాశం జిల్లా మార్టూరుకు చెందిన 18 మంది యువకులు పాండురంగాపురం బీచ్​లో స్నానానికి దిగారు. అలల ఉద్ధృతి ఎక్కువగా ఉండటం వల్ల ఇద్దరు గల్లంతయ్యారు. మత్స్యకారుల సాయంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

two people missed in pandurangapuram beach
ప్రకాశం జిల్లా యువకులు గల్లంతు
author img

By

Published : Oct 18, 2020, 10:59 PM IST

బాపట్ల మండలం పాండురంగాపురం బీచ్​లో స్నానం చేస్తూ ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. వీరు ప్రకాశం జిల్లా మార్టూరుకు చెందిన గెల్లా రాజేష్​, అట్లూరి మోజెస్​గా పోలీసులు గుర్తించారు. మార్టూరు నుంచి 18 మంది యువకులు సూర్యలంక బీచ్​కు రాగా.. కొవిడ్​ నేపథ్యంలో పోలీసులు పర్యాటకులను అనుమతించలేదు.

ఈ నేపథ్యంలో పాండురంగాపురం తీరానికి వచ్చి సముద్ర స్నానం చేశారు. అలల ఉద్ధృతి ఎక్కువగా ఉండటం వల్ల వీరు నీటిలో మునిగి గల్లంతయ్యారు. మత్స్యకారుల సాయంతో వీరి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఇదీ చదవండి:

బుడమేరు కాలువలో యువకుడు గల్లంతు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.