గుంటూరు జిల్లా మాచర్ల మండలంలో ఇద్దరు పిల్లలు బావిలో పడి మరణించారు. చింతలతాండాకు చెందిన రామవత్ మధు(9) రామవత్ కల్యాణి (15) తల్లిదండ్రులతో కలిసి సరదాగా పొలానికి వెళ్లారు. అక్కడ మంచి నీళ్ల కోసం బావి దగ్గరకు వెళ్లగా... ప్రమాదవశాత్తు కాలు జారి బావిలో పడ్డారు. తల్లిదండ్రులు గమనించి వారిని కాపాడే లోపే చనిపోయారు. చిన్నారుల మృతితో తండాలో విషాదఛాయలు అమలుకున్నాయి.
ఇదీ చదవండి